గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్ల పై రగడ కొనసాగుతుంది. ఈ విషయం ఇండస్ట్రీ వర్సెస్ వైసీపీ నేతల మద్య కోల్డ్ వార్ నడుస్తుంది. ఈ మద్య సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏపి మంత్రి పేర్ని నానిని కలిశారు. టిక్కెట్ల ధరలు తగ్గించడంతో ఏపిలో కొన్ని సినిమా థియేటర్లు మూసివేసిన విషయం తెలిసిందే. తాజాగా సినీ ఇండస్ట్రీ పరిస్థితులపై చర్చించేందుకు మెగాస్టార్ చిరంజీవి ఈ రోజు సీఎం జగన్ ని కలిసేందుకు వెళ్లారు.
తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌లో జగన్‌తో కలిసి చిరంజీవి లంచ్ చేయనున్న చిరంజీవి.. టాలీవుడ్‌లో సమస్యల గురించి చర్చించనున్నారు. టికెట్ల రేట్లు తగ్గించడం అనేది ప్రధాన అంశం కాగా.. ఈ విషయంపై చర్చించడానికి ప్రభుత్వం కమిటీని కూడా ఏర్పాటు చేసింది. తాజాగా చిరంజీవి, సీఎం జగన్ భేటీపై నాగార్జున కీలక వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి వారం క్రితమే జగన్ అపాంట్‌మెంట్ కోరారని ఇవాళ ఆయన చిరంజీవిని ఆహ్వానించారని తెలిపారు. అందరి కోసం జగన్‌తో చిరంజీవి భేటీ అయ్యారని చెప్పారు. వారం రోజుల కిందట చిరంజీవి నాకు ఫోన్ చేసి సీఎం జగన్‌ను కలవబోతున్నా అని చెప్పారు. నన్ను కూడా అడిగారు. కానీ, ‘బంగార్రాజు’ సినిమా ప్రమోషన్స్, ప్రీరిలీజ్ ఈవెంట్ ఉండటంతో రావటం కుదరదని చెప్పా.
ఇది చదవండి : మోహన్ బాబుకి చెందిన శ్రీ విద్యానికేతన్ కాలేజీకి అరుదైన హోదా!
సీఎం జగన్‌తో చిరంజీవికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సీఎం జగన్ కు చిరంజీవి అంటే చాలా ఇష్టం. అంతా మంచే జరుగుతుంది అని చెప్పుకొచ్చారు. ఎవరు మాట్లాడినా ఇండస్ట్రీ కోసమేనని నాగ్ అన్నారు. ప్రస్తుతం కరోనా కారణంగా పరిస్థితులు ఎప్పటికప్పుడు తారుమారు అవుతున్నాయని, ప్రభుత్వాలు కూడా రోజుకో కొత్త నిబంధన విధిస్తున్నాయని అన్నారు.