కరోనా నేపథ్యంలో వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోవడానికి వీలు లేదు.., బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాలు ఏర్పాటు చేయకూడదు అంటూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిబంధనలు విధించిన విషయం తెలిసిందే. అయితే.., పండగ దగ్గర పడుతున్న కొద్దీ.. ఈ విషయంలో హిందూ సంఘాల నుండి, ప్రజల నుండి పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. సోషల్ మీడియాలో చాలా సెటైర్స్ కూడా నడిచాయి. ఇక కొంత మంది ఈ విషయంలో హైకోర్టుని ఆశ్రయించారు. దీంతో.., హైకోర్టు తాజాగా సంచలన తీర్పు ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ లో వినాయక చవితి ఉత్సవాలు జరుపుకునేందుకు ఏపీ హైకోర్టు అనుమతులు మంజూరు చేసింది. ప్రైవేటు స్థలాల్లో అన్నీ అనుమతులతో వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసుకోవచ్చునని న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే.., కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, ఒకేసారి ఐదుగురికి మించకుండా పూజలు చేసుకోవాలని సూచనలు చేసింది. ఈ తీర్పుపై హిందూ సంఘాలు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాయి. మరి.. ఈ తీర్పుని ప్రభుత్వానికి ఎదురుదెబ్బగా పరిగణించవచ్చా? ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.