రూపాయికే లీటర్‌ పెట్రోల్‌!..ఈ విడ్డూరం మనదేశంలోనే!..

పెట్రోల్‌ రేట్లు కొంత కాలంగా మండిపోతున్నాయి. ఇక ఇప్పుడైతే ఏకంగా పెట్రోల్ రేట్లు లీటర్‌కు సెంచరీ దాటిపోయింది. డీజీల్ పరిస్థితీ ఇంచుమించు అంతే. అందుకే ఈ ధరలు చూసి జనం బెంబేలెత్తిపోతున్నారు. మండుతున్న పెట్రోలు ధరలు వాహనదారుల జేబులకు చిల్లులు పెడుతున్నసంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఒక రూపాయికే పెట్రోలు లభించడం వరంలా మారింది. దీంతో జనం క్యూట్టారు. మహారాష్ట్ర సీఎం కుమారుడు, మంత్రి ఆదిత్య ఠాక్రే పుట్టినరోజు సందర్భంగా ఆదివారం రూపాయికే లీటర్‌ పెట్రోల్‌ కార్యక్రమం చేపట్టింది డోంబివలీ యువసేన. ఠాణేలోని ఓ పెట్రోల్‌ బంకులో ఈ అవకాశం కల్పించింది.

petrol compressedవిషయం తెలియగానే వాహనదారులు బారులు తీరారు. బంకు ముందు కిలోమీటర్ల మేర క్యూలైన్లు కనిపించాయి. సుమారు 1200 మందికి లీటరుకు ఒక రూపాయి చొప్పున పెట్రోలు అందించారు. మహారాష్ట్ర యువనేత, పర్యావరణ మంత్రి ఆదిత్యా థాక్రే పుట్టినరోజు సందర్బంగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు వాహనదారులకు బారులుతీరారు.

డొంబివ్లీకి చెందిన శివసేన కార్పొరేటర్, దీపేశ్ మత్రే, పూజా మత్రే, కల్యాణ్ యువసేన నేత యోగేశ్ మత్రేతో సహా మరికొంతమంది నేతలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 500 మందికి ఇవ్వాలనుకున్నా, జనం భారీగా రావడంతో దీన్ని కొనసాగించామని యోగేశ్ తెలిపారు.   మహారాష్ట్రలోనే అంబర్‌నాథ్‌ వింకో నకాలోని ఓ పెట్రోల్‌బంక్‌లో లీటరు పెట్రోల్‌ రూ.50కే అందించారు. మోడీ సర్కారు మాత్రం పెట్రోధరలను పెద్ద ఆదాయ వనరుగానే చూస్తోంది.

పెట్రో ధరలపై కేంద్రానికి లభించే ఆదాయం ఆరేళ్లలో 300 శాతం పెరిగింది.  ఈ లెక్కలు సాక్షాత్తూ కేంద్రమే పార్లమెంటులో చెప్పింది. 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి పది నెలల్లో పెట్రోల్, డీజిల్ పై కేంద్రానికి రూ.2.94 లక్షల కోట్ల ఆదాయం వచ్చిందట.