ఒకే వైన్ షాపులో 3 గంటల్లో 3.5 కోట్ల మధ్యం ఖాళీ

liquor sale

హైదరాబాద్- తెలంగాణలో ఆరోజు బుధవారం నుంచి లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. నిన్న మంగళవారం మద్యాహ్నం 2 గంటలకు లాక్ డౌన్ పై ప్రభుత్వం నుంచి ప్రకటన రాగానే ఒక్కసారిగా ప్రజలు అవాక్కయ్యారు. వెంటనే హడావుడిగా తనకు కావాల్సిన నిత్యావసర వస్తువులను కొనుక్కునేందుకు పరుగులు తీశారు. ఇక మందుబాబుల పరిస్తితి మాత్రం మరింత ఆందోళన కరం అని చెప్పవచ్చు. మంగళవారం మద్యాహ్నం నుంచి వైన్ షాపుల ముందు బాబులు క్యూ కట్టారు. మొత్తం పది రోజులకు సరిపడా మందును పోటీ పడీ మరీ కొనుక్కున్నారు. కరోనా ఆంక్షలు అమల్లో ఉన్నా దాన్ని లెక్క చేయకుండా, కనీసం భౌతిక దూరం పాటించకుండా ఒకరిని మరొకరు తోసుకుంటూ మద్యాన్ని కొన్నారు. తెలంగాణలో లోని అన్ని వైన్ షాపుల్లో సాయంత్రాని కల్లా దాదాపు మందు అంతా అమ్ముడైపోయిందంటే మందుబాబుల ఆరాటం ఎలా ఉందో అర్దం చేసుకోవచ్చు.

హైదరాబాద్‌లోని ఓ వైన్ షాపులో అమ్ముడైన మందు విలువ తెలిసి అంతా నోరెళ్లబెడుతున్నారు. జూబ్లీహిల్స్‌లోని ఓ వైన్ షాపులో కేవలం 3 గంటల వ్యవధిలోనే అక్షరాల 3 కోట్ల 55 లక్షల రూపాయల విలువైన మద్యం అమ్ముడైపోయింది. కేవలం ఒక వైన్ షాపులో ఇంత తక్కువ సమయంలో ఇంత అధిక మొత్తం అమ్ముడవడం ఓ రిడార్డ్ అని ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. సదరు వైన్ షాపులో 3 గంటల తరువాత చిన్న బీరు బాటిల్ కూడా మిగల్లేదంటే ఎంతగా ఎగబడి కొన్నారో తెలుస్తోంది. పలానా బ్రాండ్ మందే కావాలని ఏంలేదు.. ఏ మందు ఉంటే ఆ మందు ఇవ్వండని.. ఏదో ఒక బాటిల్ దొరికితే చాలని మందుబాబులు ఉన్న మందునంతా ఖళీ చేశారు. ఐతే లాక్ డౌన్ సమయంలోను ఉదయం 6 గంంటల నుంచి వైన్ షాపులు కూడా తెరుస్తామని ప్రభుత్వం ప్రకటించాక అయ్యో ఎంతపనైంది కదా అని మధ్యం ప్రియులు నోరెల్లబెట్టడం కొసమెరుపు.