మందుబాబులకు ఇది నిజంగా చేదు వార్తే. ఈ ఏడాది క్యాలెండర్ లోని ఒకరోజుని త్యాగం చేయాల్సి ఉంటుంది. ఆ రోజు మందుకు దూరంగా ఉండాలి. తప్పదు మరి. ఎందుకంటే?
ఒకరోజు తిండి లేకపోయినా, తాగడానికి నీరు లేకపోయినా పర్లేదు గానీ చీకటి పడ్డాక కడుపులో మెడిసన్ పడకపోతే గిలగిలలాడిపోయే మందుబాబులకు బ్యాడ్ న్యూస్. ఆ ఒక్కరోజు అక్కడ మాత్రం మందు దొరకదు. ఎందుకంటే మద్యం దుకాణాలు మూసివేయాలని తెలంగాణ పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 6వ తేదీన మద్యం అమ్మకాలు చేయకూడదని హైదరాబాద్ పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకూడదన్న ఉద్దేశంతో, హనుమాన్ జయంతి ఉత్సవాలు ప్రశాంతంగా జరగడం కోసం అన్ని మద్యం దుకాణాలు, కల్లు దుకాణాలు, రెస్టారెంట్ తో అటాచ్ అయి ఉన్న బార్లు, స్టార్ హోటల్స్, క్లబ్స్ మూసివేయాలని రాచకొండ పోలీస్ కమిషనరేట్ డి.ఎస్. చౌహాన్ ఆదేశాలు జారీ చేశారు.
రాచకొండ పోలీస్ స్టేషన్ పరిథిలో ఉన్న మద్యం దుకాణాలు, స్టార్ హోటల్స్, బార్లు వంటి వాటిని మూసివేయాలని పేర్కొన్నారు. ఏప్రిల్ 6వ తేదీ ఉదయం 6 గంటల నుంచి ఏప్రిల్ 7వ తేదీ ఉదయం 6 గంటల వరకూ మద్యం దుకాణాలు మూసే ఉంటాయని అన్నారు. దుకాణాలను, బార్లను, క్లబ్బులను తెరిచి ఉంచితే యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలానే మద్యం సేవించి ర్యాలీలో అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏప్రిల్ 6న హనుమాన్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. హనుమాన్ జయంతి రోజున 12 కి.మీ. మేర ర్యాలీ జరగనుంది.
పాతబస్తీలోని గౌలిగూడ హనుమాన్ ఆలయం నుండి తాడ్ బండ్ లోని హనుమాన్ ఆలయం వరకూ హనుమాన్ ఉత్సవ ర్యాలీ జరగనుంది. ఈ ర్యాలీ ప్రశాంతంగా సాగడం కోసం పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అల్లర్లు జరగకుండా ఉండడం కోసం.. ముఖ్యంగా మద్యం తాగితే సమస్యలు తలెత్తే అవకాశం ఉన్న కారణంగా రాచకొండ పోలీస్ స్టేషన్ పరిథిలోని మద్యం దుకాణాలు, బార్లు, స్టార్ హోటళ్లు, క్లబ్బులు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి మందు ప్రియులు ఏప్రిల్ 6వ తేదీ ఉదయం 6 గంటల నుంచి ఏప్రిల్ 7వ తేదీ ఉదయం 6 గంటల మధ్యలో మద్యం కొనాలి అనుకుంటే కుదరదు. మరి పోలీసులు తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.