మద్యం ప్రియులకు రాష్ట్ర ప్రభుత్వం షాకిచ్చింది. మద్యం దుకాణాలను మూసివేస్తూ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది.
మద్యం ప్రియులకు షాకిచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. తాజాగా మద్యం దుకాణాలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఏకంగా రాష్ట్రంలోని మద్యం దుకాణాలను మూసివేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ దెబ్బతో మద్యం ప్రియులు అంతా ఒక్కసారిగా తలలు పట్టుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాలను ఎందుకు మూయాలనుకుంటుంది. రాష్ట్రంలో ఏం జరుగుతోంది? అసలు ఈ మద్యం దుకాణాలు ఏ రాష్ట్రంలో మూసి వేస్తున్నారనే పూర్తి వివరాలు ఇప్పుడు మీ కోసం.
తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాలపై తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి మద్యం దుకాణాలను మూసి వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. విషయం ఏంటంటే? రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ నిర్వహించే 500 మద్యం దుకాణాలను విడతల వారిగా మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ రిటైలర్ టాస్మాక్ (తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్) బుధవారం ప్రకటించింది. మొదటగా పాఠశాలలు, ఆలయాలు సమీపంలో ఉన్న మద్యం దుకాణాలను మూసివేయనున్నట్లు సమాచారం. ఈ వార్త తెలుసుకున్న మద్యం ప్రియులు షాక్ గురవుతున్నారు.