తెలంగాణ రాష్ట్రంలో మద్యం దుకాణాల టెండర్లకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,620 మద్యం షాపులకు టెండర్లను ఆబ్కారీశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.
కరోజు తిండి లేకపోయినా పర్లేదు కానీ చీకటి పడ్డాక కడుపులో మందు పడకపోతే మందుబాబులకు నిద్రపట్టదు. ఇంటికి చుట్టాలు వచ్చినా వారికి మర్యాద చేయడం కోసం మద్యం తీసుకుంటారు. ఏ పండగలొచ్చినా మద్యం దుకాణాలు కిక్కిరిసి పోతున్నాయి. చాలా మంది మద్యం సేవించడం ఎంజాయ్ చేయడం అలవాటైంది. మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా మద్యం సేవిస్తున్నారు కాబట్టి డిమాండ్ బాగా పెరిగింది. ఎన్నికల సమయంలోనైతే మద్యం ఏరులై పారుతుంది.ప్రభుత్వానికి అధిక మొత్తంలో రాబడి మద్యం ద్వారానే చేకూరుతుంది. అయితే మద్ం దుకాణాల టెండర్లకు సర్కార్ నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాదారులను ఎంపిక చేయుటకు నిర్ణయించింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం..
తెలంగాణ రాష్ట్రంలో మద్యం దుకాణాల టెండర్లకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,620 మద్యం షాపులకు టెండర్లను ఆబ్కారీశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పుడు ఉన్న మద్యం దుకాణాల లైసెన్స్ గడువు నవంబర్ 30తో ముగుస్తుండడంతో డిసెంబర్ నెల నుండి కొత్త లైసెన్సులను లాటరీ ద్వారా మంజూరు కానున్నవి. ఈ రోజు జిల్లాల వారీగా సర్కార్ నోటిఫికేషన్ ఇవ్వనుంది. రేపటి నుండి దరఖాస్తులను స్వీకరించనుంది. ఆగస్టు 21న లాటరీలు తీసి షాపులను కేటియించనున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం త్వరగా దరఖాస్తుల ప్రక్రియను ముగించి లైసెన్సులను విడుదల చేయాలని నిర్ణయించింది.
దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 4 నుండి మొదలై 18వ తేదీ సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. ఒక్కొక్క దరఖాస్తుకు రూ.2 లక్షలను గవర్నమెంట్ ఫీజుగా నిర్ణయించారు. డిసెంబర్ 1 నుండి నూతన మద్యం షాపులు ప్రజల అందుబాటులోకి రానున్నాయి. అయితే దరఖాస్తు రుసుములు, లైసెన్సు ఫీజులు గతంలో ఉన్న విధానాన్నే ఫాలో అవుతున్నారు. పాలసీ గడువు అయిపోతున్న నేపథ్యంలో బార్లు, ఏ4 కు కొత్త లైసెన్సులు జారీ చేస్తారు. రాష్ట్రంలో కొత్త బార్లకు అనుమతులు ఇవ్వకుండా లైసెన్సు రుసుముల్లో మాత్రం మార్పులు రానున్నాయి.
రాష్టంలో మద్యంపై టాక్స్ రేటు ఎక్కువగా ఉండడంతో ధరలు పెరిగాయి. దీంతో పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్నాటక, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాలనుండి వైన్ దిగుమతి చేసుకుంటున్నారు. తెలంగాణలో టాక్స్ రేటు తగ్గించాలని ఆబ్కారీశాఖ ప్రభుత్వానికి నివేదికను అందించింది. ధనిక వర్గాలు సేవించే మదుపానీయాలైన రెడీ టూ డ్రింక్, వైన్‌లను మరింత ప్రోత్సహంచే విధంగా ప్రభుత్వం కొంత కార్యాచరణ చేసింది. దీంతో పన్ను రేటు తగ్గించడంతో వ్యాపారుల లాభం పెరుగుతుందని ప్రభుత్వం యోచిస్తోంది.