షాదీ అయినా, బారసాల అయినా ఆడవాళ్లు చీరలు, నగలు ముచ్చట్లు పెట్టుకున్నట్లు, మగవాళ్లంతా మందు పార్టీ కోసం ఎదురు చూస్తుంటారు. ఇక మద్యం ప్రియులు అయితే రోజుకో పెగ్గు వేసుకోందే నిద్ర పట్టదు. కొంత మందికి వీకెండ్స్‌తో ఫ్రెండ్స్‌తో కలిసి ఎంజాయ్ చేస్తుంటారు.
షాదీ అయినా, బారసాల అయినా ఆడవాళ్లు చీరలు, నగలు ముచ్చట్లు పెట్టుకున్నట్లు, మగవాళ్లంతా మందు పార్టీ కోసం ఎదురు చూస్తుంటారు. ఇక మద్యం ప్రియులు అయితే రోజుకో పెగ్గు వేసుకోందే నిద్ర పట్టదు. కొంత మందికి వీకెండ్స్‌తో ఫ్రెండ్స్‌తో కలిసి ఎంజాయ్ చేస్తుంటారు. మరికొంత మందికి శాలరీ పడ్డ కొన్ని రోజుల వరకు పండగ రోజులే లెక్క. ఇక పర్వదినాలు, పబ్బాలు అయితే చెప్పనక్కర్లేదు మందులో జోగుడే. బారాత్ ఏదైనా మందుబాబులంతా మద్యంలో మునుగుడే. పండుగలు, వీకెండ్స్‌లో మద్యం దుకాణాలు సైతం కళకళలాడుతుంటాయి. ఒక చుక్క ఎక్కువైనా పర్వాలేదు కానీ తక్కువ కాకుండా మాత్రం చూసుకుంటారు. అలాంటి వారికి నివ్వెర పోయి విషయం చెబుతా.. వినుకోండి
ఇక రానున్నది పండుగల సీజన్ అందులోనూ తెలంగాణలో ఆషాఢంతోనే హడావుడి మొదలవుతుంది. బోనాలు, ఆ తర్వాత శ్రావణ మాసంతో తెలంగాణాలో అన్ని ప్రాంతాలు సందడి సందడి నెలకొంటాయి. ఈ సమయంలో మందులో మునిగి తేలిపోదామనుకుంటున్నారా.. అయితే ఈ చేదు వార్త మీ కోసమే. వచ్చే ఆదివారం బోనాల పండుగ సందర్భంగా ఈ నెల 16వ తేదీ నుండి 18వ తేదీ ఉదయం వరకు హైదరాబాద్ లో మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. ఈ మేరకు నగర పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ జోన్ల పరిధిలో 16వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 17వ తేదీ ఉదయం 6 గంటల వరకు (ఒక రోజు) , సౌత్‌జోన్ పరిధిలో 16వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీ ఉదయం 6 గంటల వరకు అనగా రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు మూసివేయాలని ఉత్తర్వులో పేర్కొన్నారు.