థియేటర్లలోకే దూసుకొస్తానంటోన్న ఖిలాడీ!..

మాస్ మ‌హారాజ మ‌ళ్లీ స‌క్సెస్ బాట ప‌ట్టాడు. వ‌రుస ప్లాపుల‌తో స‌త‌మ‌త‌మైన ఈ హీరో ఈ ఏడాది క్రాక్ సినిమాతో దుమ్ము లేపాడు. క‌లెక్ష‌న్ల‌తో ఇండ‌స్ట్రీని షేక్ చేశాడు.  ఫుల్ జోష్‌తో  ప్ర‌స్తుతం ఖిలాడీలో న‌టిస్తున్నాడు. ఈ సినిమాను టీజర్‌ను ఉగాది కానుకగా ఒక రోజు ముందు విడుదల చేసారు. ఈ టీజర్‌ను సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కించినట్టు కనబడుతోంది. టీజర్ స్టార్టింగ్‌లో ఓ హార్బర్‌ను చూపిస్తూ జైల్లో హీరో రవితేజను చూపించారు. ఈ సినిమాలో రవితేజ సైకో తరహా పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో రవితేజ డ్యూయల్ రోల్‌లో నటించాడా ? ఒకడే ఇద్దరిగా ప్రవర్తించాడా అనేది ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమా షూటింగ్ మొన్న‌టి వ‌ర‌కు యూర‌ఫ్‌లో జ‌రిగింది. కరోనా కేసులతో ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్., మరోవైపు ఏపీలో కర్ఫ్యూ అమల్లోకి తెచ్చారు. దీంతో ముందుగా విడుదల తేదిలు ఖరారు చేసుకున్న సినిమాలు వాయిదా పడుతున్నాయి. ఈ నేపథ్యంలో రవితేజ హీరోగా నటించిన ‘ఖిలాడి’ మూవీ విడుదల తేదిని పోస్ట్‌పోన్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ ఆస‌క్తి క‌ర వార్త చెక్క‌ర్లు కొడుతోంది.

unnamed 5ఈ సినిమాను మొన్న‌టి వ‌ర‌కు ఓటీటీలో రిలీజ్ చేస్తార‌నే ప్ర‌చారం సాగింది. అయితే అదేం లేద‌ని, ఎట్టి ప‌రిస్థితుల్లో థియేట‌ర్ల‌లోనే విడుద‌ల చేస్తామ‌ని నిర్మాత స‌త్యానారాయ‌ణ ప్ర‌క‌టించారు. అన్ని హంగుల‌తో ర‌వితేజ మాస్ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని సినిమాను రూపొందిస్తున్నట్టు వివ‌రించారు. త్వ‌రోల‌నే సినిమా రిలీజ్ డేట్‌ను ప్ర‌క‌టిస్తామ‌ని వివ‌రించారు. ఇందులో మీనాక్షి చౌద‌రి, డింపుల్ హ‌య‌తీ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.