తెలుగు యంగ్ హీరోయిన్ వివాదంలో చిక్కుకుంది. ఏకంగా పోలీస్ అధికారితో గొడవపడినందుకు ఈమెపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఇంతకీ ఏం జరిగింది?
తెలుగు హీరోయిన్ డింపుల్ హయతి వివాదంలో చిక్కుకుంది. ‘ఖిలాడి’, ‘రామబాణం’ తదితర సినిమాలతో ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేసిన ఈమె.. ఇప్పుడు ఏకంగా ఓ పోలీస్ అధికారితోనే గొడవ పడింది. ప్రస్తుతం ఈ విషయం కాస్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈమెపై మూడు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేశారు. రీసెంట్ గానే ‘రామబాణం’తో పలకరించిన ఈమెపై ఇప్పుడు పోలీసు కేసు నమోదు కావడంపై అభిమానులు షాకవుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందా అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అసలు ఈ ముద్దుగుమ్మ ఏం చేసింది? ఎవరు కేసు పెట్టారు?
ఇక వివరాల్లోకి వెళ్తే.. విజయవాడకు చెందిన డింపుల్ హయాతి, ‘గల్ఫ్’ మూవీలో హీరోయిన్ గా చేసి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ‘గద్దలకొండ గణేష్’లో స్పెషల్ సాంగ్ చేసింది. తెలుగులో రీసెంట్ టైంలో రవితేజతో ‘ఖిలాడి’, గోపీచంద్ తో ‘రామబాణం’ చిత్రాలు చేసింది. ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ అపార్ట్ మెంట్ లో ఉంటున్న ఈమె.. పార్కింగ్ విషయంలో అదే అపార్ట్ మెంట్ లో ఉంటున్న రాహుల్ హెగ్డే అనే పోలీస్ అధికారితో తరుచూ గొడవ పడుతోందట. ఆయన ప్రభుత్వ అధికారిక వాహనాన్ని తాజాగా డింపుల్ కి కాబోయే భర్త డేవిడ్ ఢీ కొట్టడంతో ఈ గొడవ కాస్త పెద్దది అయింది. ఇదే విషయమై డింపుల్ కూడా పోలీస్ ఆఫీసర్ కారుని పదేపదే తన్నింది. దీంతో ఈ ఇష్యూ కాస్త పోలీసు స్టేషన్ కు చేరుకుంది. డింపుల్ పై మూడు సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
హైదరాబాద్ లో ట్రాఫిక్ డీసీపీగా పనిచేస్తున్న రాహుల్ హెగ్డే.. హీరోయిన్ డింపుల్ హయాతి ఉంటున్న అపార్ట్ మెంట్ లోనే ఉంటున్నారు. పార్కింగ్ విషయమై ఎన్నిసార్లు సర్దిచెప్పినా ఆమె వినలేదని రాహుల్ అంటున్నారు. ఇప్పుడు కూడా గొడవ కాస్త పెద్దది కావడంతో పోలీస్ అధికారి రాహుల్ కారు డ్రైవర్ చేతన్.. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో డింపుల్, అతడి ఫ్రెండ్ డేవిడ్ ని పోలీస్ స్టేషన్ కి పిలిపించారు. ఇద్దరిని ఈ విషయంలో హెచ్చరించి CRPC 41a కింద నోటీసులు ఇచ్చి, విచారణకు అవసరమైతే మరోసారి రావాలని చెప్పి పంపించారు. మరి ఈ ఇష్యూపై మీరేం అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.