సినీ ఇండస్ట్రీలో RGV అంటేనే వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అని తెలిసిందే. ఎల్లప్పుడూ వివాదాలతో వార్తల్లో నిలుస్తుంటాడు. ఆర్జీవీ లాజిక్స్ నచ్చినవారు దేవుడిగా భావిస్తుంటారు. ఆయన లాజిక్స్ అర్ధం లేనివని భావించేవారు వ్యతిరేకిస్తుంటారు. అయితే.. ‘పుష్ప’ సినిమాలో కేశవగా నటించిన జగదీష్ కూడా వర్మ భక్తుడేనట.
పాన్ ఇండియా స్థాయిలో రిలీజైన పుష్ప సినిమాలో హీరో అల్లు అర్జున్ స్నేహితుడి(మొండేలు)గా ఫుల్ లెంగ్త్ రోల్ కనిపించాడు జగదీష్. నిజానికి హీరో క్యారెక్టర్ తర్వాత అంతటి ప్రాధాన్యత కేశవ పాత్రకి ఉందని చెప్పవచ్చు. హీరోయిన్ కంటే ఎక్కువ స్కోప్ కేశవ పాత్రకి ఉంది. అసలు పుష్ప సినిమానే కేశవ వాయిస్ ఓవర్ తో సాగుతుంది. ఈ సినిమాతో జగదీష్ మంచి గుర్తింపు దక్కించుకున్నాడు.
‘ఈరోజు నేను నటుడిగా ఈ స్థానంలో ఉన్నానంటే కారణం దర్శకుడు రామ్ గోపాల్ వర్మే.. ఆయన రాసిన పుస్తకం చదవడం వల్లే తన లైఫ్ మారిపోయిందని’ చెప్పి ఆశ్చర్యానికి గురిచేశాడు జగదీష్. జగదీష్ మాట్లాడుతూ.. “ఆర్జీవీ గారే నా ఇన్స్పిరేషన్.. నేను కూడా సినిమాలు చేయగలను అనే నమ్మకం ఆయన వల్లే కలిగింది. ‘ఓడ్కా విత్ వర్మ’ అనే పుస్తకంలో వర్మ చెప్పిన ‘నటన అంటే అనుభవం కాదు. టెక్నికల్ నాలెడ్జ్ కూడా అవసరం లేదు. ఒక విజన్ ఉండి చేయాలనే కసి, నీపై నీకు నమ్మకం ఉంటే యాక్టింగ్ పెద్ద కష్టం కాదు” అనే మాటలే నన్ను ప్రభావితం చేశాయి.
అందుకే వర్మ గారంటే నాకిష్టం. ఆయన పుస్తకాలన్నీ చదివాను. నాపై నాకు నమ్మకం కలిగింది. వెంటనే ఒకరి దగ్గర డబ్బు అప్పు అడిగి మరీ షార్ట్ ఫిల్మ్ తీశాను. ఎప్పటికైనా ఫిల్మ్ మేకింగ్ చేయాలనేది నా ఆశ” అంటూ తన మనసులో మాట బయటపెట్టాడు జగదీష్. మరి కేశవ కూడా ఆర్జీవీ భక్తుడే.. అతని మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.