పుష్ప మూవీలోని కేశవాకి అరుదైన గౌరవం! ఇంతకన్నా ఏమి కావాలి?

Pushpa fame Keshava at college pics viral

గుర్తింపు.. ప్రతి మనిషి దీనికోసం ఆరాటపడతాడు. అందుకోసం శ్రమిస్తాడు. అవును మరి నలుగురిలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు. అందరూ కోరుకుంటారు.. కానీ కొందరు మాత్రమే ఆ దిశగా ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయాణంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని దాటుకుని.. తమ గమ్యాన్ని చేరుకుని.. సమాజం చేత గుర్తించబడతారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు పుష్ప సినిమాలో కేశవ పాత్ర పోషించిన జగదీష్‌కు సరిగ్గా సరిపోతాయి.

చదువుకునే రోజుల్లో.. ఓ అనామకుడిగా ఉండిపోయిన జగదీష్‌.. నేడు అదే కాలేజీ వారి ఆహ్వానం మేరకు ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెళ్లి.. వారి చేత ప్రశంసలు పొందడమే కాక.. ఒకప్పుడు తనకు పాఠాలు చెప్పిన టీచర్ల నోటి వెంట.. నేడు తన జీవితం గురించి విద్యార్థులకు స్ఫూర్తి పాఠాలు భోదిస్తుంటే.. ఇక ఈ జీవితానికి ఇంతకు మించి కావాల్సింది ఏముంది అంటూ భావోద్వేగానికి గురయ్యాడు. ఆ వివరాలు..

ఇది కూడా చదవండి: వైరల్ వీడియో: పుట్టగానే పుష్పరాజ్ లా ‘తగ్గేదేలే’ అంటున్న బుడ్డోడు..

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ హీరోగా లెక్కల మాస్టార్‌ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం ‘పుష్ప’. రెండు పార్ట్‌లుగా తెరకెక్కిన ఈ చిత్రం తొలి భాగం ‘పుష్ప ది రైజ్’గా గత ఏడాది డిసెంబ‌ర్ 17న విడుద‌లై సూపర్ హిట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పక్కనే ఉండే కేశవ పాత్రకు కూడా మంచి పేరు దక్కింది. కథలో ఈ పాత్ర ప్రాధాన్యం కూడా ఎక్కువే. పుష్ప కథను చెప్పేదే కేశవ. సినిమా విడుదల తర్వాత కేశవ పాత్రపై ప్రశంసలు కురిపించారు. వందల సినిమాలు చేస్తే దక్కే గుర్తింపు ఒక్క సినిమాతో లభించింది.

Pushpa fame Keshava at college pics viral

పుష్ప సినిమా కన్నా ముందు జగదీష్‌ చేసింది కొన్ని సినిమాలే. వాటిలో కూడా చిన్న చిన్న పాత్రలే. పుష్ప కంటే ముందు జగదీష్‌ పలాస 1978, మల్లేశం సినిమాలలో నటించాడు. అతడి ప్రతిభను గుర్తించిన సుకుమార్‌ పుష్పలో అవకాశం ఇచ్చాడు. సినిమా విడుదల తర్వాత ఈ పాత్రకు వచ్చిన గుర్తింపు, ప్రశంసలు అన్నిఇన్నికావు. ఈ క్రమంలోనే తాజాగా కేశవ అలియాస్‌ జగదీష్‌ కు అరుదైన గౌరవం లభించింది. ఆ వివరాలు..

ఇది కూడా చదవండి: ఊ అంటావా.. సాంగ్‌ ని ఇలా కూడా పాడచ్చా?

తొమ్మిదేళ్ల క్రితం ఏ కాలేజ్‌లో అయితే అంతగా గుర్తింపు లేని ఓ విద్యార్థిగా ఉన్నాడో.. తాజాగా అదే కాలేజీ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు జగదీష్‌. తనకు చదువు చెప్పిన గురువులే.. నేడు తన కథను విద్యార్థులకు స్ఫూర్తి కథనంగా బోధిస్తుంటే.. తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. తనకు చదువు చెప్పిన టీచర్లే తనను ప్రశంసిస్తుంటే.. వారి చేత సన్మానం పొందుతుంటే.. ఆ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం. జగదీష్‌ కూడా అలానే ఫీలయ్యాడు.

తనకు పాఠాలు చెప్పిన లెక్చరర్ లే తనతో ఫోటోలు దిగడం, వారితో సరిసమానంగా కూర్చోబెట్టుకోవడం, భోజనం పెట్టి సాగనంపడం చూసిన కేశవ అలియాస్‌ జగదీష్‌కు నోట మాట రాలేదు. కాసేపు కాలేజీలో గడిపి, పాత స్నేహితులను కలుసుకుని.. తిరిగి అక్కడ నుంచి వెళ్లిపోయాడు కేశవ. ఈ సంఘటన గురించి కేశవ స్నేహితుడు.. ఒకరు ఫేస్‌బుక్‌లో షేర్‌ చేయడంతో ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది. చదువులో వెనకబడినా.. జీవితంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నావ్‌ అంటూ నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: మాల్‌ దొరికింది.. పుష్ప కూడా దొరికాడు: యూపీ పోలీస్‌