కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు ఆకస్మిక మృతితో.. ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ఆదివారం మధ్యాహ్నం రమేష్ బాబు అంత్యక్రియలు ముగిసాయి. మహేష్ బాబు అన్న అంత్యక్రియలకు హాజరు కాలేదు. కొన్ని రోజుల క్రితం మహేష్ కరోనా బారిన పడటంతో.. ప్రసుత్తం ఆయన క్వారంటైన్ లో ఉన్నారు. ఇక సోదరుడు రమేష్ బాబు మృతి పట్ల మహేష్ బాబు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. సోదరుడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ.. ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. ఎన్ని జన్మలెత్తినా రమేష్ నే అన్నయ్యగా కోరుకుంటానని తెలిపారు.
Brothers Bond🥺 #StayStrongMaheshAnna pic.twitter.com/Qoc7oOz13R
— MV (@Nan_varuven) January 9, 2022
ఇది కూడా చదవండి : రమేష్ బాబు చేయాలనుకున్న ఆ సినిమా.. రెండు సార్లు ఆగింది
ఈ క్రమంలో మహేష్ బాబు.. ‘‘నువ్వే నా స్ఫూర్తి.. నా బలం, నా ధైర్యం, నా సర్వస్వం, నువ్వు లేకుంటే నేను ఈ రోజు ఇలా ఉండేవాడిని కాదు. నాకోసం నువ్వు చేసిన ప్రతి పనికీ ధన్యవాదాలు. ఈ జన్మలోనే కాదు.. ఎన్ని జన్మలైనా నువ్వే నా అన్నగా ఉండాలని కోరుకుంటున్నాను. నిన్ను ఎప్పటికి ప్రేమిస్తూనే ఉంటాను’’ అని మహేష్ బాబు ట్వీట్ చేశారు.
— Mahesh Babu (@urstrulyMahesh) January 9, 2022
గతంలో మహేష్ బాబు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు అన్న రమేష్ బాబు సర్వస్వం అని తెలిపారు. నాన్న కృష్ణ సినిమాలతో బిజీగా ఉండటంతో రమేష్ బాబు తన ఆలనా పాలనా చూసేవారని తెలిపారు. అన్నయ్యే తన సర్వస్వం అన్నారు. మహేష్ బాబు వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.