తమిళ చిత్ర పరిశ్రమని విషాదంలో నెట్టేసిన కె.వి.ఆనంద్ మృతి

కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో మరో విషాదం. ప్ర‌ముఖ కోలీవుడ్ ద‌ర్శ‌కుడు కె.వి.ఆనంద్‌(54) శుక్ర‌వారం తెల్ల‌వారుజామున మూడు గంట‌ల‌కు గుండెపోటుతో క‌న్నుమూశారు. జర్నలిస్టుగా స్వల్ప కాలం తరువాత, 1990 ల ప్రారంభంలో దక్షిణాది మరియు బాలీవుడ్ పరిశ్రమలలో పదిహేను చిత్రాలకు పనిచేసిన ఆయన సినిమాటోగ్రాఫర్ అయ్యారు. ఓ సాధారణ స్టిల్ ఫొటోగ్రాఫర్ స్థాయి నుంచి కోలీవుడ్ మెచ్చిన దర్శకుడిగా ఎదిగారు కేవీ ఆనంద్. రొటీన్ కాన్సెప్టులు ఎంచుకోవడం ఆయనకు చేతకాదు. కొత్త కథల్లోనే కమర్షియల్ ఎలిమెంట్స్ చొప్పించి చూపించడం ఆయన పంథా. రంగం, బ్రదర్స్, వీడొక్కడే లాంటి సినిమాలు ఆయన అభిరుచిని తెలుపుతాయి. ఆయన తీసిన చివరి సినిమా సూర్య హీరోగా నటించిన బందోబస్త్.

director and cinematographer k v anand passes away 1193477

ఆనంద్ సినిమాటోగ్రాఫర్‌గా తెన్మావిన్ కొంబాత్‌గా తొలి చిత్రం చేసినందుకు ఉత్తమ సినిమాటోగ్రఫీకి జాతీయ చిత్ర అవార్డును గెలుచుకున్నారు. ప్రేమ‌దేశం, ఒకేఒక్క‌డు, ర‌జినీకాంత్ శివాజీ చిత్రాల‌కు సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేశారు. క‌ణా కండేన్ సినిమాతో ద‌ర్శ‌కుడిగా మారారు.సూర్య‌తో వీడొక్క‌డే(అయాన్‌)తో హిట్ కొట్టి దర్శకుడిగా తన మార్క్ క్రియేట్ చేసిన ఆనంద్ జీవాతో తెర‌కెక్కించిన రంగం(కో) సినిమాతో అటు తమిళంతో పాటు తెలుగులోనూ సూప‌ర్ హిట్ కొట్టి ద‌ర్శ‌కుడిగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. త‌ర్వాత బ్ర‌ద‌ర్స్‌(మాట్రాన్‌), అనేకుడు(అనేగ‌న్‌), కవ‌న్‌, బందోబ‌స్త్‌(కాప్పాన్‌) చిత్రాల‌ను తెర‌కెక్కించారు. కె.వి.ఆనంద్ మృతిపై చిత్ర ప‌రిశ్ర‌మ దిగ్బ్రాంతిని వ్య‌క్తం చేసింది. 

K V Anand 1 1

చెన్నైలో పుట్టిన పెరిగిన కె.వి.ఆనంద్ ఫ్రీ లాన్స్ ఫొటో జ‌ర్న‌లిస్ట్‌గా త‌న కెరీర్‌ను స్టార్ట్ చేశారు. క‌ల్కి, ఇండియా టుడే దిన ప‌త్రిక‌ల్లో ప‌నిచేశారు. ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ పీసీ శ్రీరామ్‌ను క‌లిసి సినిమాటోగ్ర‌ఫీలో శిష్యుడిగా మారారు. ఆ త‌ర్వాత ద‌ర్శ‌కుడిగా మారారు. ఈయ‌న సినిమాటోగ్ర‌ఫీ వ‌హించిన తొలి చిత్రం ‘తెన్ మావిన్ కొంబాత్’ సినిమాకు నేష‌న‌ల్ అవార్డ్ వ‌చ్చింది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here