జెస్సీ కోసం రంగంలోకి కౌశల్.. పోస్ట్ వైరల్

Kaushal Manda About Jessie in Bigg Boss - Suman TV

కరోనా నేపథ్యంలో బిగ్ బాస్ 5 తెలుగు కాస్త ఆలస్యంగా ప్రారంభమైన..వేడి మాత్రం అస్సలు తగ్గలేదు. ఈ సీజన్ ప్రారంభమైందో లేదో అప్పుడే విభేదాలు భగ్గుమంటున్నాయి. అయితే షో ప్రారంభమైన తొలిరోజు నుంచే ఒకరిపై మరొకరు మాటల దాడికి దిగారు. ఈ క్రమంలోనే సోమవారం తొలి ఎపిసోడ్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్ జెస్సీ నెగిటివిటిని సదరు కంటెస్టెంట్స్ బయట పెట్టారు.

ఇక మొదటి రోజే ఎక్కువ మంది సభ్యులు జెస్సీని నామినేట్ చేశారు. ఇందులో భాగంగా నటరాజ్‌ మాస్టర్‌ కూడా జస్సీని నామినేట్‌ చేస్తూ చిన్నోడా నిన్ను చూస్తే అయాకుడిలా ఉన్నావు, ఈ హౌజ్‌లో నువ్వు ఉండలేవు అనిపిస్తుంది. అంటూ మాట్లాడారు. ఇలా ఒక్కొక్కరు ఒకలా అతనిపై ఉన్న నెగిటివిని బయటపెట్టడంతో కంటెస్టెంట్ జెస్సీ కాస్త భావోద్వేగానికి లోనయ్యాడు. వాదోపవాదనల మధ్య జెస్సీ షోలో ఏడుస్తూ కనిపించాడు. దీంతో షోలోని మిగత సభ్యులు అతనిని ఓదార్చేందుకు ముందుకొచ్చారు.

Kaushal Manda About Jessie in Bigg Boss - Suman TVఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ విన్నర్ కౌశల్ సైతం జెస్సీకి కాస్త మద్దతుగా నిలిచాడు. మోడలింగ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ లో నా తర్వాత సీజన్‌ 3లో అలీ రేజా తర్వాత వస్తుంది నువ్వే. మోడల్స్‌ ఎప్పుడే కానీ కన్నీళ్లు పెట్టకూడదని, తమ యాటిట్యూడ్‌తో ఇతరుల నుంచి ప్రేమని గెలుచుకోవాలని సూచించారు. అలా ఏడిస్తే మొదటగా హౌజ్‌ నుంచి ముందుగా నువ్వే బయటకు వస్తావు, జాగ్రత్తగా ఆడు ఆల్‌ ది బెస్ట్‌ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ షేర్ చేస్తూ జెస్సీకి కొన్ని సూచనలు చేశాడు కౌశల్.