బుల్లితెరపై ఎంటర్టైన్ మెంట్ షోలను ప్రెజెంట్ చేయడంలో ఓంకార్ స్పెషలిస్ట్ అనే సంగతి తెలిసిందే. తెలుగు ఫ్యామిలీ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని కొత్త కొత్త ప్రోగ్రామ్స్ తెరమీదకు తీసుకొస్తుంటారు. అలాగే ఓంకార్ నిర్వహించే టీవీ షోలకు తానే హోస్ట్ గా వ్యవహరిస్తుంటారు. ప్రస్తుతం ఆయన హోస్ట్ గా వ్యవహరిస్తున్న షోలలో ‘ఇస్మార్ట్ జోడి-2’ ఒకటి. సెకండ్ సీజన్ గా ప్రసారమవుతున్న ఈ ప్రోగ్రాం ఫినాలేకి దగ్గర పడుతోంది.
ఈ క్రమంలో ఇస్మార్ట్ జోడిలుగా సెలబ్రిటీ జంటలు చాలానే ఉన్నాయి. అయితే.. ఈ వారానికి సంబంధించిన లేటెస్ట్ ప్రోమోలో బిగ్ బాస్ ఫేమ్ కౌశల్ – కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ మాస్టర్ ఎమోషనల్ అయ్యారు. నామినేషన్స్ లో భాగంగా ఇద్దరూ లైఫ్ స్ట్రగుల్స్ గుర్తుచేసుకొని కంటతడి పెట్టుకున్నారు. కౌశల్ నామినేట్ చేయగానే బాబా మాస్టర్.. లైఫ్ లో ఎప్పుడు ఎవరో ఒకరి చేతిలో మోసపోతూనే ఉన్నాను అంటూ ఎమోషనల్ అయిపోయాడు.
ఆ తర్వాత కౌశల్ మాట్లాడుతూ.. ‘బంధాలు, బాంధవ్యాలు లేవు.. ఫ్రెండ్స్ లేరు’ అని కంటతడి పెట్టుకున్నాడు. కౌశల్ కన్నీళ్లు చూసి బాబా మాస్టర్ నేనున్నాను అంటూ దగ్గర తీసుకున్నాడు. ప్రస్తుతం కౌశల్, బాబా మాస్టర్ ల ఎమోషనల్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఓంకార్ షోలో ఇలాంటి ఎమోషన్స్ సాధారణమే. మరి కౌశల్, బాబా మాస్టర్ ఎమోషనల్ అయిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.