సెలబ్రిటీలు ఏం చేసినా జనాలకు వినోదంగానే ఉంటుంది. జనాలను ఎంటర్టైన్ చేయడానికే సెలబ్రిటీలు నిరంతరం ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో కొన్నిసార్లు వివాదాలలో చిక్కుకోవడం.. ఊహించని పరిణామాలు ఫేస్ చేయడం కూడా జరగవచ్చు. టైమ్ బాగోలేకపోతే దెబ్బలు కూడా తినవచ్చు. తాజాగా కమెడియన్ హైపర్ ఆది విషయంలో అలాంటిదే జరిగింది. ఏకంగా టీమ్ అందరూ కలిసి ఆదిని కుమ్మేశారు.
సాధారణంగా సెలబ్రిటీలు ఏం చేసినా జనాలకు వినోదంగానే ఉంటుంది. జనాలను ఎంటర్టైన్ చేయడానికే సెలబ్రిటీలు నిరంతరం ప్రయత్నాలు చేస్తుంటారు. ఎల్లప్పుడూ అంటే.. సినీ సెలబ్రిటీలకు సాధ్యం కాకపోవచ్చు. కానీ.. బుల్లితెర సెలబ్రిటీలు మాత్రం జనాలను ఎంటర్టైన్ చేసేందుకు అన్నివిధాలా అవకాశాలకోసం చూస్తుంటారు. ఈ క్రమంలో కొన్నిసార్లు వివాదాలలో చిక్కుకోవడం.. ఊహించని పరిణామాలు ఫేస్ చేయడం కూడా జరగవచ్చు. టైమ్ బాగోలేకపోతే దెబ్బలు కూడా తినవచ్చు. తాజాగా కమెడియన్ హైపర్ ఆది విషయంలో అలాంటిదే జరిగింది. ఏకంగా టీమ్ అందరూ కలిసి స్టేజ్ పైనే ఆదిని కుమ్మేశారు.
ఆ వివరాల్లోకి వెళ్తే.. బుల్లితెరపై పాపులర్ అయిన ‘ఢీ’ షోకి సంబంధించి కొత్తగా ప్రోమో రిలీజ్ అయింది. యాంకర్ ప్రదీప్ హోస్ట్ చేస్తున్న ఈ సీజన్ 15వది. ప్రోమో బట్టి చూస్తే.. ఈ వారం ఈ షోలో శేఖర్ మాస్టర్, హీరోయిన్ శ్రద్ధాదాస్ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. కాగా.. హైపర్ ఆది, డ్యాన్సర్ పండు కమెడియన్స్ గా సందడి చేస్తున్నారు. అయితే.. ప్రోమో మధ్యలో పండుని స్టేజ్ పై డూప్ స్టిక్స్ తో శేఖర్ మాస్టర్, శ్రద్ధాదాస్ కొట్టారు. అంతలోనే హైపర్ ఆది మధ్యలో రావడంతో శ్రద్ధా ఆదిని కూడా కొట్టింది. వెంటనే ఆది కూడా శ్రద్దాను తన చేతిలో ఉన్న ఫేక్ స్టిక్ తో తిరిగి కొట్టేసరికి.. ఆడపిల్లను కొడతావా అంటూ.. అందరూ టీమ్ గా ఏర్పడి ఆదిని కుమ్మేశారు.
దీంతో టీమ్ కొట్టే దెబ్బలు తాళలేక ఆది అక్కడినుండి సైడ్ అయిపోయాడు. ప్రస్తుతం ఢీ షోలో హైపర్ ఆది దెబ్బలు తిన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పైగా శ్రద్ధాను తిరిగి కొట్టడానికి ప్రయత్నించినందుకు హైపర్ ఆదిపై ఫైర్ అవుతున్నారు నెటిజన్స్, ఢీ షో ఫ్యాన్స్. ఇదిలా ఉండగా.. హైపర్ ఆది టీవీ స్క్రీన్ పైనే కాకుండా ఈ మధ్య సినిమాలలో కూడా బిజీ అయిపోయాడు. వరుసగా చేతినిండా సినిమా అవకాశాలతో ఆది కమెడియన్ గా కెరీర్ బిల్డ్ చేసుకుంటున్నాడు. మరోవైపు శ్రద్ధా అడపాదడపా సినిమాలు చేస్తూనే.. టీవీ షోలలో మెరుస్తోంది. వీరిద్దరూ కలిసి ఢీలో చేసే సందడి మామూలుగా లేదు. మరి ఢీ షోలో శ్రద్ధా – ఆదిల కాంబినేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.