బిగ్ బాస్-2 విన్నర్ కౌశల్ తన తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. తండ్రికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి ఎట్టకేలకు తన మాట నిలబెట్టుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు కాస్త వైరల్ గా మారాయి.
ఎన్నో సీరియల్స్, సినిమాల్లో నటిస్తున్న కౌశల్ ప్రతిభతో ఎంతో మంది అభిమానులకు సంపాదించుకున్నారు. ఇక ఇదే కాకుండా బిగ్ బాస్-2లో కంటెస్టెంట్ గా రాణించి చివిరికి విన్నర్ గా నిలిచి తన సత్తా చాటారు. ఇక అప్పటి నుంచి కౌశల్ అందివచ్చిన అవకాశాలను ఒడిసిపట్టుకుని అక్కడక్కడ కొన్ని టీవీ షోల్లో పాల్గొంటున్నారు. ఇక ఇదే కాకుండా ఇటీవల స్టార్ మాలో ప్రారంభమైన బీబీ జోడిలో సైతం కౌశల్ డ్యాన్సర్ గా రాణిస్తున్నాడు.
ఇదిలా ఉంటే కౌశల్ తాజాగా తన తండ్రికి ఓ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి ఫైనల్ గా తన మాట నిలబెట్టుకున్నారు. ఎప్పటి నుంచో ఉన్న కౌశల్ తండ్రి కోరికను కొడుకు తాజాగా తీర్చి తన తండ్రిని సంతోషపరిచారు. విషయం ఏంటంటే? 2021లో ఫాదర్స్ డే సందర్భంగా కౌశల్ తండ్రి.. నాకంటూ ఓ ఇల్లు కావాలని అడిగాడు. ఆ ఇల్లు వైజాగ్ లో కావాలని కోరాడు. దీంతో అప్పటి నుంచి కౌశల్.. ఎలాగైన నా తండ్రి కోరికను నెరవేర్చాలని ఎప్పటి నుంచో అనుకున్నాడు.
ఇక కౌశల్ తన తండ్రికి హైదరాబాద్ లో ఓ చిన్న ఇల్లు కొని అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి తన మాట నిలబెట్టుకున్నారు. తాజాగా ఈ ఇల్లు గృహ ప్రవేశం కూడా జరిగింది. ఈ సందర్భంగా నటుడు కౌశల్ మాట్లాడుతూ… మా నాన్న 2021లో ఫాదర్స్ డే సందర్భంగా నాకంటూ ఓ ఇల్లు కావాలని, అది కూడా వైజాగ్ లో కావాలని అడిగారు. కానీ, మా నాన్న ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటున్నాడు కాబట్టి అతనికి హైదరాబాద్ లోనే ఓ ఇల్లు కొన్నానని కౌశల్ అన్నారు.
ఇక ఫైనల్ గా నా కోరిక నెర వేరిందని కౌశల్ సంతోషం వ్యక్తం చేశారు. ఇకపోతే ఈ గృహ ప్రవేశంలో భాగంగా అతని కుటంబ సభ్యులు అందరూ పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియోను సైతం కౌశల్ తన యూట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ చేశాడు. ఇక ఈ వీడియోను చూసిన అతని అభిమానులు ఒక్కొరు ఒక్కోలా స్పందిస్తున్నారు. అయితే ప్రస్తుతం కౌశల్ బిబీ జోడిలో డ్యాన్సర్ గా రాణిస్తున్నాడు. ఇతనికి అభినయ శ్రీ అనే డ్యాన్సర్ ను జోడిగా ఇచ్చారు. ప్రస్తుతం ఈ షో బాగానే ఆదరణ పొందుంది.