కళ్యాణ్ రామ్ బింబిసార ఫస్ట్ లుక్.. బాహుబలిని మించిపోనుందా

ఫిల్మ్ డెస్క్- బాహుబలి సినిమాను ఎవ్వరు మరిచిపోలేరు. ఆ సినిమాలో ప్రభాస్ ను చూస్తే ఎంత భారీగా అనిపించిందో.. ఇప్పుడు నందమూరి కళ్యణ్ రామ్ ను చూస్తే కూడా అలాగే అనిపిస్తోంది. నందమూరి తారక రామారావు 98వ జయంచి సందర్బంగా కళ్యాణ్ రామ్ నందమూరి అభిమానులకు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. కళ్యాణ్ రామ్ నటిస్తున్న బింబిసార సినిమాకి సంబందించి ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. గొప్పరాజు, బుద్ధుడి స్నేహితుడైన బింబిసారుడి చారిత్రక నేపధ్యం ఉన్న కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటివరకు రొమాంటిక్, మాస్ సినిమాల్లో నటించి ఆకట్టుకున్న నందమూరి కళ్యాణ్ రామ్, ఇప్పుడు బింబిసార సినిమాలో సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారు.

bimbisara

ఇక బింబిసార ఫస్ట్ లుక్ లో యుధ్ద భూమి కనిపిస్తోంది. ఆ యుధ్ద భూమిలో కళ్యాణ్ రామ్ శత్రువలు శవాల గుట్టపై కూర్చుని ఉన్నారు. చేతిలో ఖడ్గంతో ఉగ్రరూపుడై కనిపిస్తున్నారు నందమూరి కళ్యాణ్ రామ్. ఈ పోస్టర్ ను బట్టి చూస్తే అప్పటికే యుధ్దం ముగియగా, అక్కడ చుట్టూ శత్రువుల శవారు పడి ఉండగా, ఇంకా ఎవరైనా మిగిలి ఉన్నారా అన్న విధంగా కళ్యాణ్ రామ్ చూస్తున్నట్లుగా కనిపిస్తోంది. మరి బుధ్దుడి స్నేహితుడైన బింబిసారుడి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఈ పోస్టర్ కు సంబందించిన యుధ్దం ఎందుకు, ఎప్పుడు జరిగిందో తెలియాలంటే మాత్రం సినిమా విడుదలయ్యే వరకు ఆగాల్సిందే. ఇక బింబిసార సినిమా ఫస్ట్ లుక్ లో కళ్యాణ్ రామ్ అదిరిపోయారని నందమూరి ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.

తాత ఎన్టీఆర్ జయింతి రోజున భలే మంచి బహుమతి ఇచ్చారని అభిమానులు పండగ చేసుకుంటున్నారు. కళ్యాణ్ రామ్ లుక్ వీడియోలో బాహుబలి సినిమా రేంజ్ లో కనిపిస్తుంది. ఈ టైటిల్ లుక్ కళ్యాణ్ రామ్ అభిమానుల్లో ఎన్నో అంచనాలు పెంచాయి. బింబిసార ఫస్ట్ లుక్ అద్భుతంగా ఉందని, ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని నందమూరి అభిమానులు అంటున్నారు. ఇక ఈ సినిమాకు వశిస్ట్ దర్శకత్వం వహిస్తున్నారు. కళ్యాణ్ రామ్ సొంత నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై బింబిసార మూవీని నిర్మిస్తున్నారు. అయితే హీరోయిన్ మిగతా నటీనటుల వివరాలను ఇంకా అనౌన్స్ చేయలేదు త్వరలోనే దానిపై కూడా అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాలో మిగతా నటీనటుల విరాలు తెలియాల్సి ఉంది.