ఇదివరకు సినీ ఇండస్ట్రీలో ఐటమ్ సాంగ్స్ కోసం సపరేట్ బ్యూటీస్ ఉండేవారు. ఐటమ్ సాంగ్స్ చేసేవారు దాదాపు వాటినే కెరీర్ గా ఎంచుకునేవారు. అప్పట్లో ఐటమ్ సాంగ్స్ తో సూపర్ క్రేజ్ దక్కించుకున్న భామలు చాలామంది ఉన్నారు. కానీ.. కాలం మారుతున్నకొద్దీ ఇండస్ట్రీలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. అలాగే సినిమాలలో ఐటమ్ సాంగ్స్ కి ప్రాధాన్యత కూడా మారుతూ వచ్చింది. ఈ క్రమంలో హీరోయిన్స్ గా స్టార్డమ్ అందుకున్నవారే ఐటమ్ సాంగ్స్ చేసేస్తున్నారు.. చేసేందుకు ఆసక్తి కూడా చూపిస్తున్నారు. ఇక స్టార్ హీరోయిన్లే(తమన్నా, సమంత, కాజల్, శృతిహాసన్ ఇలా అందరూ) ఐటమ్ సాంగ్స్ చేసేసరికి సినిమాలలో వాటికి డిమాండ్ తో పాటు ఆదరణ కూడా పెరుగుతూ వచ్చింది.
ఎంతటి స్టార్ హీరో సినిమాలోనైనా అవసరాన్ని బట్టి, సినిమాలో మాస్ ఎలిమెంట్స్, కంటెంట్ బట్టి.. ఫ్యాన్స్ కి కిక్కిచ్చేందుకు ఐటమ్ సాంగ్స్ ప్లాన్ చేస్తుంటారు దర్శకనిర్మాతలు. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ ని మించి ఓ కొత్త బ్యూటీ గురించి చర్చలు ఎక్కువగా జరుగుతున్నాయి. తెలుగులో నటిగా సినిమాలు చేయలేదు గానీ.. ఐటమ్ సాంగ్స్ తో మాత్రం ఓ ఊపు ఊపేస్తోంది. ఆ కొత్త బ్యూటీ ఎవరో కాదు.. వారినా హుస్సేన్. ఆఫ్ఘనిస్తాన్ కి చెందిన ఈ భామ.. మోడలింగ్ ద్వారా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. 1999లో పుట్టిన వారినా.. 19 ఏళ్లకే ‘లవ్ యాత్రి’ మూవీ ద్వారా బాలీవుడ్ లో హీరోయిన్ గా డెబ్యూ చేసింది. సల్మాన్ ఖాన్ ద్వారా ఇండస్ట్రీ పరిచయమైన వారినా.. సల్మాన్ సరసన ‘దబాంగ్ 3’ ఐటమ్ సాంగ్ లో ఆడిపాడింది.
న్యూయార్క్ ఫిలిం అకాడమీలో పర్ఫార్మింగ్ ఆర్ట్స్ కంప్లీట్ చేసిన ఈ భామ.. కెరీర్ ప్రారంభంలో పలు కమర్షియల్ బ్యూటీ యాడ్స్ లో మెరిసింది. ఇక మొదటి సినిమా లవ్ యాత్రి బాక్సాఫీస్ వద్ద యావరేజ్ హిట్ అవ్వడంతో.. అమ్మడికి పెద్దగా అవకాశాలు రాలేదట. దీంతో హీరోయిన్ గా కంటే ఐటమ్ సాంగ్స్ కే డిమాండ్ ఎక్కువగా ఉందని భావించి.. ఆవైపు అడుగులు వేసింది. తెలుగులో బింబిసార మూవీతో పరిచయమైంది. ఈ సినిమాలో ‘గులేబకావళి’ అనే ఐటమ్ సాంగ్ లో తన అందాలన్నీ కెమెరా ముందుపరచి ప్రేక్షకుల మతులు పోగొట్టింది. అందులో నుండి తేరుకునేలోపే తాజాగా ‘గాడ్ ఫాదర్’ మూవీలో బ్లాస్ట్ బేబీ అంటూ మరో ఐటమ్ సాంగ్ తో సర్ప్రైజ్ చేసింది.
అటు గులేబకావళి, ఇటు బ్లాస్ట్ బేబీ.. రెండు ఐటమ్ నెంబర్స్ సూపర్ హిట్ అయ్యేసరికి.. వారినా పేరు టాలీవుడ్ వర్గాలలో కాస్త గట్టిగానే వినిపిస్తోంది. బాలీవుడ్ నుండి వచ్చింది కదా.. అందాల ఆరబోతలో ఏమాత్రం వెనకాడటం లేదు బ్యూటీ. వారినా టాప్ టు బాటమ్ హొయలన్నీ తెలుగు ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. 23 ఏళ్ళ వారినా.. మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ లో బ్లాస్ట్ బేబీ అంటూ ఫుల్లుగా గ్లామర్ విందు చేసింది. ఈ సాంగ్ లో వారినాను చూసినవారంతా మున్ముందు అమ్మడు మరిన్ని సాంగ్స్ తో ఇంకా బిజీ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. హీరోయిన్ గా బిగ్ సక్సెస్ అందుకోలేకపోయిన వారినా.. ఐటమ్ గర్ల్ గా మాత్రం మిలియన్స్ లో ఫ్యాన్ క్రేజ్ సొంతం చేసుకుంది. మరి ఈ బ్లాస్ట్ బేబీ ఇకపై తెలుగు ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో చూడాలి.