‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఏ మూవీ చేస్తాడా? ఎలాంటి మూవీతో వస్తాడా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్.. దాదాపు ఏడాది నుంచి ఎదురుచూస్తూనే ఉన్నారు. గతేడాది తారక్ బర్త్ డే సందర్భంగా టీజర్ తప్పించి ఒక్క అప్డేట్ గానీ, ఏం జరుగుతుందనే విషయం గానీ ఎవరికీ తెలియదు. దీంతో నందమూరి ఫ్యాన్స్ తెగ ఆరాటపడుతున్నారు. సోషల్ మీడియాలో ఈ మూవీ గురించి తెగ ట్వీట్స్ చేస్తున్నారు. దీంతో చాలామందికి ఈ సినిమా వస్తుందా రాదా అనే డౌట్ కూడా ఏర్పడింది. ఇప్పుడు ఆ ప్రశ్నలన్నింటికి సమాధానం అన్నట్లు ఎన్టీఆర్ పవర్ ఫుల్ ఆన్సర్ ఇచ్చేశాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఒకప్పుడు సినిమాని నేరుగా థియేటర్లలోకి వెళ్లి ఫ్యాన్స్, ప్రేక్షకులు చూసేవారు. టెక్నాలజీ పెరిగిన తర్వాత టీజర్, ట్రైలర్, పాటలు.. ఇలా ఒకటేమిటి చాలా అప్డేట్స్.. సినిమా రిలీజ్ కంటే ముందు సోషల్ మీడియాలో విడుదల చేస్తూ వస్తున్నారు. అయితే కొన్నిసార్లు అప్డేట్స్ కోసం సదరు నిర్మాతల్ని.. ట్విట్టర్, ఇన్ స్టాలో అభిమానులు ఇబ్బందిపెట్టిన సందర్భాలు చాలానే. గత కొన్నాళ్ల నుంచి ఎన్టీఆర్ 30 టీమ్ ది కూడా సేమ్ అదే పరిస్థితి. ‘జనతా గ్యారేజ్’ లాంటి హిట్ జోడీ మరోసారి సినిమా చేస్తున్నారనేసరికి అభిమానులు కూడా అంచనాలు పెంచేసుకుంటున్నారు. అయితే అప్డేట్స్ అంటూ కాస్త తొందరపడుతున్నారు. ఇప్పుడు వారందరికీ స్మూత్ వార్నింగ్ అన్నట్లు ఎన్టీఆర్ మాట్లాడాడు.
‘సినిమాలు చేసేటప్పుడు మీతో చెప్పేందుకు కొన్నిసార్లు ఏం ఉండదు. ప్రతిరోజూ, ప్రతి పూట, ప్రతి గంటకు అప్డేట్ ఇవ్వాలంటే చాలా కష్టం. మీ ఆరాటం, మీ ఉత్సాహం నాకు అర్థమవుతోంది. కానీ దానివల్ల దర్శక నిర్మాతలపైనా ఒత్తిడి పెరుగుతుంది. ఫ్యాన్స్ అడుగుతున్నారని వారు భావించి ఏది పడితే అది చెప్పలేరు. ఏదైనా అప్డేట్ ఇచ్చినప్పుడు అది నచ్చకపోతే మళ్లీ వాళ్లని మీరే తిడతారు. ఇది నా విషయంలోనే కాదు అందరు హీరోలకు ఇలానే జరుగుతోంది. తప్పకుండా ఇవ్వాల్సిన, అదిరిపోయే అప్డేట్ ఏదైనా ఉంటే భార్య కంటే ముందు మీకే చెప్తాం. ఎందుకంటే మీరు మాకు అంత ముఖ్యం. సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా ఈ నెలలోనే సినిమాను లాంఛనంగా ప్రారంభిస్తాం. మార్చి 20లోపే షూటింగ్ మొదలుపెడతాం. 2024 ఏప్రిల్ 5న మూవీ రిలీజ్ చేస్తాం’ హీరో ఎన్టీఆర్ చాలా సీరియస్ గా చెప్పుకొచ్చాడు. మరి తారక్ చెప్పిన దానిపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.