టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా స్పిరిట్ మూవీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రకటించినప్పటి నుంచి ఈ చిత్రంపై భారీ అంచానాలు ఏర్పడ్డాయి. తాజాగా స్పిరిట్ మూవీకి సంబంధించిన ఓ అప్డేట్ ఇచ్చాడు డైరెక్టర్. అదేంటంటే?
సినిమా ఇండస్ట్రీలో కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. క్రేజీ డైరెక్టర్ ఓ స్టార్ హీరోతో కలిసి పనిచేస్తున్నాడు అంటే చాలు ఫ్యాన్స్ పండగే పండగ. ఇక టాలీవుడ్ లో అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ ‘స్పిరిట్’. టాలీవుడ్ లో ఒకే ఒక్క మూవీతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ అయ్యాడు సందీప్ రెడ్డి వంగా. విజయ్ దేవరకొండతో అర్జున్ రెడ్డి మూవీ చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. దాంతో అందరి చూపు ఇతనిపైనే పడింది. ఇక రెబల్ స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ మూవీ ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమా అప్డేట్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. తాజాగా ప్రభాస్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే అప్డేట్ ఇచ్చాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.
సందీప్ రెడ్డి వంగా.. అర్జున్ రెడ్డి మూవీతో టాలీవుడ్ లో ఓ కొత్త చరిత్రను క్రియేట్ చేశాడు. 2017లో విడుదలైన ఈ సినిమా ఓ సంచలనం. ఇక ఇదే సినిమాను షాహిద్ కపూర్ తో హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేసి భారీ హిట్ కొట్టాడు. ప్రస్తుతం రణ్ బీర్ కపూర్ తో యానిమల్ అనే ప్రతిష్టాత్మక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు ఈ యంగ్ డైరెక్టర్. యానిమల్ లో రణ్ బీర్ కు జోడీగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తోంది. అయితే రెండు సంవత్సరాల క్రితమే ప్రభాస్ తో స్పిరిట్ అనే ప్రాజెక్ట్ ను ప్రకటించాడు. అప్పటి నుంచి ప్రేక్షకులు ఈ సినిమా అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు.
అయితే తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పిరిట్ సినిమాపై క్రేజీ అప్డేట్ ఇచ్చాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి. యానిమల్ తర్వాత స్పిరిట్ సినిమా ఉంటుంది, ప్రభాస్ అన్న అంటే భారీ అంచనాలు ఉంటాయి కదా అని సందీప్ రెడ్డి అన్నాడు. ఆ భారీ అంచనాలను అందుకునేలా స్పిరిట్ ఉంటుందని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. అయితే ఒకానొక దశలో అసలు స్పిరిట్ సినిమా ఉంటుందా? లేదా అన్న సందేహాలకు తాజాగా సమాధానం ఇచ్చాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ప్రస్తుతం అతడు యానిమల్ షూటింగ్ లో బిజీగా ఉంటే.. ప్రభాస్ సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె లతో బిజీగా ఉన్నాడు. మరి రెబల్ స్టార్ స్పిరిట్ మూవీ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#Prabhas anna ante expectations ekkuvuntayi ga. ❤️
Sensational director @imvangasandeep about #Spirit 🔥#SandeepReddyVanga #SpiritTheMovie pic.twitter.com/h9BPwlsbLn
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) February 17, 2023
#SandeepReddyVanga about #Spirit #Prabhas #Animal pic.twitter.com/BbfwmC6ExT
— Skyups Media (@skyupsMedia) February 17, 2023