టాలీవుడ్ ప్రస్తుతం మంచి జోష్ లో ఉంది. గత రెండు నెలల నుంచి మంచి మంచి హిట్ సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. ఇక తాజాగా ఆ ఊపుని కొనసాగిస్తూ దసరాకి కూడా ‘గాడ్ ఫాదర్’, ‘ద ఘోస్ట్’ వచ్చేశాయి. హిట్స్ కొట్టేశాయి! ఇక థియేటర్ కి వెళ్లేవారు ఎలానూ బిగ్ స్క్రీన్ పై ఎక్స్ పీరియెన్స్ చేయాలనుకుంటారు. మిగిలిన వాళ్లు.. ఓటీటీలో కొత్త సినిమాలు ఏవి వచ్చాయా? వాటిని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తుంటారు. ఇప్పుడు అలాంటి వారి కోసమే ‘బింబిసార’ ఓటీటీ విడుదల తేదీని ప్రకటించారు.
ఇక వివరాల్లోకి వెళ్తే… నందమూరి కల్యాణ్ రామ్ కి చాలా రోజుల తర్వాత హిట్ ఇచ్చిన సినిమా ‘బింబిసార’. సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ కి టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ కలిపి తీసిన ఈ చిత్రం.. ప్రేక్షకుల్ని విపరీతంగా అలరించింది. దర్శకుడు వశిష్ఠకు ఇది తొలి చిత్రమే అయినప్పటికీ ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు. ఏ మాత్రం అంచనాల్లేకుండా వచ్చిన ‘బింబిసార’.. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ టాక్ అందుకుంది. సుమారు రూ.75 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఇందులో కల్యాణ్ రామ్ ద్విపాత్రాభినయం చేయడం విశేషం. ఇప్పటికే థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం.. ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసిన ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పేశారు.
#KalyanRam #Bimbisara movie streaming – OCT 21st – #ZEE5telugu pic.twitter.com/F6qzkWbsGn
— telugufunworld (@telugufunworld) October 5, 2022
‘బింబిసార’ డిజిటల్ రైట్స్ ని జీ5 ఓటీటీ సంస్థ దక్కించుకుంది. ఈ క్రమంలోనే దసరాకి రిలీజ్ చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ దీపావళి కానుకగా అక్టోబరు 21న స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. వీకెండ్, ఆపై దీపావళి పండుగ కలిసి రావడంతో ఓటీటీలో కూడా ఈ సినిమా వ్యూస్ తో రికార్డు క్రియేట్ చేయడం ఖాయం! ఇదిలా ఉండగా ఇందులో కేథరిన్, సంయుక్త మేనన్ హీరోయిన్లుగా నటించారు. కీరవాణి సంగీతమందించారు. అలానే ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉందండోయ్.. మరి ‘బింబిసార’ ఓటీటీ రిలీజ్ కోసం మీలో ఎంతమంది వెయిటింగ్. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.