హీరో విశాల్ కి ప్రమాదం! అసలు ఏమైందంటే?

vishal accident

సినిమా ఇండస్ట్రీ అంటే పైకి కేవలం రంగురంగుల లోకంలా, అందంగా కనిపిస్తుంది. కానీ.., ఇక్కడ సర్వైవ్ అవ్వడం అంత సులభం కాదు. ఏ క్షణంలోనైనా జీవితం తిరగబడి పోతుంది. సెట్స్ లో ఎప్పుడు.., ఎటు వైపు నుండి ప్రమాదం ముంచుకొస్తుందో కూడా చెప్పడం కష్టం. ఇందుకే సినీ ఇండస్ట్రీలో నిత్యం ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. తాజాగా యాక్షన్ హీరో విశాల్ కూడా ఇలాంటి ప్రమాదానికి గురి అయ్యాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.. తమిళ, తెలుగు సినీ ఇండస్ట్రీలలో యాక్షన్ హీరోగా విశాల్ కి మంచి పేరు ఉంది. కానీ.., ఈ మధ్య కాలంలో ఆయన చిత్రాలు బాక్సాఫీస్ పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి. దీంతో.., విశాల్ ఎలా అయినా సక్సెస్ ట్రాక్ లోకి రావాలని కష్టపడుతున్నాడు.

hero vishalఈ నేపథ్యంలోనే డిటెక్టివ్ సీక్వెల్ పనుల్లోనూ విశాల్ బిజీ అయ్యాడు. దర్శకుడు మిస్కిన్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో దర్శకత్వ బాధ్యతలను కూడా విశాల్ తన భుజానికెత్తుకున్నాడు. ఇక దీంతో పాటు.., విశాల్ ఇప్పుడు ఆర్యతో కలిసి ఎనిమీ అనే మల్టిస్టారర్ మూవీలో నటిస్తున్నాడు. ఇప్పటికే కొన్ని షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ మూవీ షూటింగ్ కి కరోనా కారణంగా బ్రేక్ పడింది. అయితే.., ఇప్పుడు మళ్ళీ షూటింగ్స్ ప్రారంభం అవ్వడంతో విశాల్ సెట్ లో అడుగు పెట్టాడు. ఈ చిత్ర షూటింగ్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సెట్‌లో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విశాల్ కి ప్రమాదం అయింది.

ఫైటర్స్ టైమింగ్ మిస్ అవ్వడంతో బీర్ బాటిల్ విశాల్ తలకి బలంగా తగిలినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో విశాల్ కూడా స్పందించాడు. “చిన్న ప్రమాదానికి గురి అయ్యాను. ఈ విషయంలో స్టంట్ ఆర్టిస్ట్‌ల తప్పేమీ లేదు. జస్ట్ టైమింగ్ మిస్. యాక్షన్ సీక్వెన్స్‌లో ఇలాంటివి జరుగుతుంటాయి. దేవుడి దయ, మీ ప్రేమతో బ్యాక్ టు బ్యాక్ షూటింగ్ చేశాం.. ఫైట్ సీక్వెన్స్ చేసేశాం. యాక్షన్ సీక్వెన్స్‌ను ఇంత అద్బుతంగా తెరకెక్కించినందుకు థ్యాంక్స్ టు రవివర్మ మాస్టర్” అని చెప్పుకొచ్చాడు విశాల్. ఇక.. ఈ ప్రమాదం నుండి విశాల్ క్షేమంగా బయట పడటంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.