తమిళ హీరోలు తెలుగులో డైరెక్ట్ గా సినిమాలు చేస్తూ సందడి చేస్తున్నారు. ఇప్పటికే అరంగ్రేటం చేయగా.. మరికొందరు ఎంట్రీకి సిద్ధంగా ఉన్నారు. దలపతి విజయ్, కార్తీ, శివకార్తికేయన్, ధనుష్, విజయ్ సేతుపతి లిస్టులో చేరిపోయారు. తెలుగు వాళ్లకు ఎప్పటి నుంచో బాగా సుపరిచితుడైన విశాల్ మాత్రం టాలీవుడ్ ఎంట్రీకి ఇంకా నోచుకోలేదు.
ఈ మధ్య తమిళ హీరోలు తెలుగులో డైరెక్ట్ గా సినిమాలు చేస్తూ సందడి చేస్తున్నారు. దీనిలో భాగంగా కొంతమంది హీరోలు ఇప్పటికే అరంగ్రేటం చేయగా.. మరికొందరు ఎంట్రీకి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే “వారసుడు”తో ఇళయ దలపతి విజయ్ తెలుగు వారికి దగ్గరయ్యాడు. కార్తీ, సూర్య ఎప్పుడో తెలుగులో స్ట్రెయిట్ సినిమాలు చేసి అలరించారు. ఇంకా ఈ లిస్టులో శివకార్తికేయన్, ధనుష్, విజయ్ సేతుపతి కూడా చేరిపోయారు. కానీ.. తెలుగు వాళ్లకు ఎప్పటి నుంచో బాగా సుపరిచితుడైన విశాల్ మాత్రం ఇప్పటి వరకు ఒక్క స్ట్రెయిట్ సినిమా కూడా చేయలేదు. అనువాద చిత్రాలతో అడపాదడపాగా తెలుగులో మెరుస్తున్నా.. విశాల్ టాలీవుడ్ ఎంట్రీకి మాత్రం ఇంకా నోచుకోలేదు. కానీ.. ఇప్పుడు విశాల్ ఒక తెలుగు స్ట్రెయిట్ సినిమాతో తొలిసారి ఇక్కడ ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధం అయ్యాడట.
విశాల్ తొలి సినిమా “పందెం కోడి” తెలుగులోనే పెద్ద హిట్ అయ్యింది. దీనికి తోడు.. విశాల్ కుటుంబానికి తెలుగు బ్యాగ్రౌండ్ ఉండటం అదనపు ప్రయోజనం. దీంతో.. విశాల్ టాలీవుడ్ పై కన్నేయడం ఖాయమని అప్పట్లో అంతా అనుకున్నారు. కానీ.. విశాల్ మాత్రం ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదు. ఇన్నాళ్లకు విశాల్ తెలుగు ఎంట్రీకి ముహూర్తం కుదిరిందనే కథనాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా విశాల్ సొంత బ్యానర్ లో ఉండబోతుందట. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్టు వినికిడి. 2023 ద్వితీయార్ధంలో విశాల్ ఈ ప్రాజెక్ట్ గురించి ప్రకటించే అవకాశం ఉందట.
ప్రస్తుతానికి ఈ సినిమాకి సంబంధించి కథ, దర్శకుడిని ఎంపిక చేసే పని కూడా మొదలైనట్టు తెలుస్తుంది. ప్రెజెంట్ విశాల్ “డిటెక్టివ్ 2” సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రానికి స్వయంగా తానే దర్శకత్వం వహిస్తుండటం విశేషం. ఇక ఈ మూవీ షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. మరోవైపు “మార్క్ ఆంటోనీ” అనే మరో సినిమా ప్రీప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయట. విశాల్ గత సినిమా “లాఠీ” భారీ అంచనాల మధ్య రిలీజ్ అయినా.. ఆ హైప్ ని అందుకోవడంలో విఫలమైంది. మొత్తానికి విశాల్ 200 కోట్లతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడన్న వార్త బయటకి రావడంతో అందరిలోనూ ఆసక్తి మొదలైంది. మరి.. ఈ విషయంలో విశాల్ నుండి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుంది ఏమో చూడాలి.