తమిళ స్టార్ హీరోలు విశాల్, శింబు కెరీర్ డేంజర్లో పడింది. ఒకప్పుడు కమెడియన్ వడివేలుకు వచ్చిన సమస్యే ఇప్పడు ఈ ఇద్దరు హీరోలు ఎదుర్కొంటున్నారు. అది పరిష్కారం కాకపోతే వీళ్లు నటిస్తున్న సినిమాలకు చిక్కులు తప్పవని మూవీ అనలిస్టులు అంటున్నారు.
తమిళ చిత్రసీమలో క్రమశిక్షణకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. టెక్నీషియన్స్, నటీనటులు తమ పని తాము చేసుకుంటే అక్కడ పెద్దగా ఇబ్బందులు ఉండవు. కానీ నిర్మాతలను ఇబ్బంది పెట్టడం, వివాదాలు సృష్టించడం లాంటివి చేస్తే రెడ్ కార్డ్ ఇష్యూ జారీ చేస్తారు. నిర్మాణ సంస్థలకు సమయానికి స్పందించకున్నా, అడ్వాన్స్ తీసుకొని డేట్స్ అడ్జస్ట్ చేయకపోయినా, సెట్స్‌లో కాంట్రవర్సీలు చేస్తే ఈ కార్డును ఇష్యూ చేస్తారు. స్టార్ కమెడియన్‌గా చలామణి అవుతున్న టైమ్‌లోనే వడివేలుకు రెడ్ కార్డ్ జారీ చేశారు. దీంతో ఆయనకు దాదాపు పదేళ్ల పాటు సినిమా అవకాశాలు లేకుండా పోయాయి. ఇప్పుడిప్పుడే ఆయన మళ్లీ సినిమాలు చేస్తున్నారు. అలాంటి పరిస్థితి ఇప్పుడు తమిళ చిత్ర పరిశ్రమలో మరోమారు నెలకొంది.
కోలీవుడ్ స్టార్లు విశాల్, శింబు, అధర్వతో పాటు ఎస్జే సూర్య, యోగి బాబులపై తమిళ చిత్ర నిర్మాతల మండలి రెడ్ కార్డును ఇష్యూ చేసిందని తెలుస్తోంది. కోలీవుడ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ఎన్ రామసామి నేతృత్వంలో జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసి మరీ.. విశాల్, శింబు, అధర్వ తదితరులపై యాక్షన్ తీసుకున్నారని సమాచారం. ఒక మూవీ నుంచి వాకౌట్ చేసినందుకు శింబు, లైకా ప్రొడక్షన్స్‌కు డబ్బులు తిరిగి ఇవ్వనందుకు విశాల్, అడ్వాన్స్ తీసుకొని నిర్మాతలకు డేట్లు సర్దుబాటు చేయనందుకు ఎస్జే సూర్య, యోగి బాబు, అధర్వలపై చర్యలు తీసుకున్నారట. ఇక మీదట ఇతర నిర్మాతలు ఈ యాక్టర్స్‌తో సినిమాలు చేసే ముందు కౌన్సిల్‌కు తెలియజేయాల్సి ఉంటుందట. ఈ వివాదం ఇంకా ఎంత దూరం వెళ్తుంది? దీన్ని పరిష్కరించేందుకు ఎవరు ముందుకు వస్తారనేది చూడాలి. ఒకవేళ రెడ్ కార్డు అలాగే ఉంటే మాత్రం విశాల్, శింబు లాంటి హీరోలు నటిస్తున్న చిత్రాలకు కొత్త సమస్యలు ఎదురయ్యే డేంజర్ ఉంది.
Silambarasan, Vishal, SJ Suryah, YogiBabu, Atharvaa.
RED CARD from Producers Council.
— Christopher Kanagaraj (@Chrissuccess) June 18, 2023