ఎప్పుడెప్పుడు తమ అభిమాన కధానాయకుడు ఒక ఇంటి వాడు అవుతాడా అని విశాల్ అభిమానులు ఎదురు చూస్తూ వున్నారు...అదేంటి విశాల్ కి ఇంతవరకు ఇల్లు లేదా అనుకునేరు.. ఇక్కడ ఇంటి వాడు అవ్వడం అంటే పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడా అని అర్ధం.
ఎప్పుడెప్పుడు తమ అభిమాన కధానాయకుడు ఒక ఇంటి వాడు అవుతాడా అని విశాల్ అభిమానులు ఎదురు చూస్తూ వున్నారు…అదేంటి విశాల్ కి ఇంతవరకు ఇల్లు లేదా అనుకునేరు.. ఇక్కడ ఇంటి వాడు అవ్వడం అంటే పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడా అని అర్ధం. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే విశాల్ అభిమానుల కోరిక నెరవేరేలా వుంది. ప్రముఖ తమిళ హీరోయిన్ లక్ష్మీమీనన్ తో విశాల్ పెళ్లి జరగబోతుందనే టాక్ తమిళనాడు చిత్ర పరిశ్రమలో చాలా బలంగా వినిపిస్తుంది..సుందర్ పాండియన్ అనే చిత్రంతో తమిళ చిత్ర సీమలో అరంగ్రేటం చేసిన లక్ష్మి మీనన్ అతి తక్కువ కాలం లోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. కుమ్కీ, జిగర్తాండ, కుట్టిబులి, పాండియనాడు, నాన్ సికపు మన్మన్, కొంబన్ వంటి సూపర్ హిట్ సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. లక్ష్మి మీనన్ కి గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా కూడా పేరు ఉంది.
తమిళ చిత్ర పరిశ్రమలోను, ప్రేక్షకులలోను ఒక గట్టి నమ్మకమైతే ఉండేది. లక్ష్మి మీనన్ నటించిన సినిమా సూపర్ డూపర్ హిట్ అనే నమ్మకం తమిళ చిత్ర పరిశ్రమలోను, ప్రేక్షకులలోను ఉండేది. ముఖ్యంగా విజయ్ సేతుపతి సరసన ఆమె నటించిన రెక్కై మూవీ అయితే నిత్యం తమిళ సీమలో ఏదో ఒక ఇంట్లో మారుమోగిపోతూనే ఉంటుంది. ఇప్పుడు తెలుగులో రాబోతున్నచిరంజీవి భోళాశంకర్ మూవీ లో కీర్తి సురేష్ పోషిస్తున్నచెల్లలి పాత్రని తమిళంలో లక్ష్మి మీనన్ పోషించింది. బోళాశంకర్ మూవీ కి సంబందించిన తమిళ ఒరిజినల్ వేదాళంలో అజిత్ కి చెల్లెలుగా లక్ష్మీ మీననే నటించింది..
ఇక అసలు విషయానికి వస్తే విశాల్, లక్ష్మి మీనన్ లు తాము ప్రేమలో ఉన్నామనే సంగతిని ఇద్దరు తమ తమ ఇళ్లల్లో చెప్పారని ఆ విషయం బయటికి వచ్చిందని అందుకే వాళ్ళ పెళ్లి గురించి ఇప్పుడు తమిళ టాక్ అఫ్ ది ఇండస్ట్రీ అయిందని అంటున్నారు.. గతంలో విశాల్, లక్ష్మి మీనన్ కలిసి కొన్ని సినిమాలు కూడా చేసారు. ఆ సమయంలోనే వీళ్లిద్దరి మధ్య ప్రేమ పుట్టిందని ఆయా సినిమాల్లో వాళ్ళిద్దరి కెమిస్ట్రీ కుడా బాగా వర్క్ అవుట్ అయ్యిందని అంటారు. పాండియనాడు, ఇంద్రుడు లాంటి సినిమాల్లో ఇద్దరు జంటగా నటించారు. ప్రస్తుతం చాలా రోజుల తర్వాత లక్ష్మి మీనన్ చంద్రముఖి 2 మూవీ లో నటిస్తుండగా విశాల్. మార్క్ ఆంటోనీ మూవీ లో నటిస్తున్నారు. రెండు సినిమాలు కూడా విడుదలకి సిద్దంగా ఉన్నాయి. సో.. విశాల్, లక్ష్మి మీనన్ లు కలిసి తమ పెళ్లి గురించి బహిరంగ ప్రకటన చెయ్యాలని ఇద్దరి అభిమానులు కోరుకుంటున్నారు.