తెలుగు మూవీలో హీరో ధనుష్‌. ఆ సినిమాకి రెమ్యునరేషన్ జస్ట్ రూ.50 కోట్లు!..

ధనుష్ అందరికీ సుపరిచితమే. కొత్తగా పరిచయం చెయ్యక్కర్లేదు. తమిళంలో సినిమాలు చేస్తూ  తెలుగులోనూ మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు ఈ హీరో.  విభిన్నమైన సినిమాలతో తన వర్సటైల్‌ యాక్టింగ్ తో పాన్‌ ఇండియా రేంజ్‌లో పాపులర్‌ అవుతున్న హీరో ధనుష్‌. ఈ యంగ్ హీరో స్టార్ హీరో అయినప్పటికీ చిన్న దర్శకులతో సినిమాలు చేస్తూ మంచి విజయాలను అందుకుంటున్నాడు. అంతే కాదు తన అద్బుతమైన నటనతో ఎన్నో అవార్డులు కూడా సొంతం చేసుకుంటున్నాడు ధనుష్. ఈ   హీరో ఇప్పుడు స్టార్ Postహీరో దళపతి విజయ్‌ను ఫాలో అవుతున్నారు. విజయ్‌ లాగే తాను కూడా   రచ్చ గెలుస్తానని అంటున్నారు.  ధనుష్‌  తెలుగులో డబ్బింగ్ అయిన అన్ని మూవీస్ కూడా మంచి పేరు తెచ్చుకున్నాయి. ప్రస్తుతం ఏకంగా హాలీవుడ్ చిత్రంలోనే ధనుష్ దుమ్ములేపనున్నారు.

Hero Dhanush Remunration 50 Cr - Suman TVకథ, నటనకు ప్రాధాన్యమున్న సినిమాలను సెలెక్ట్ చేసుకుంటూ ఈ హీరో బ్లాక్ బస్టర్‌ హిట్‌లను కొట్టేస్తున్నారు. ఇంత వరకు డబ్బింగ్ సినిమాలతోనే ఇక్కడి ప్రేక్షకులను అలరించారు. కానీ ఇక నేరుగా టాలీవుడ్‌లోకి ధనుష్ ఎంట్రీ ఇవ్వబోతోన్నారు.    అయితే ఈ సినిమా రేంజ్ లాగే ఈ సినిమాకి ధనుష్ రెమ్యునరేషన్ కూడా ఎక్కువే. ఈ సినిమాకు ధనుష్ ఏకంగా రూ.50 కోట్లు పారితోషికం అందుకుంటున్నారట. ఆయన కెరీర్‌లోనే ఇది అత్యధికం కావడం విశేషం. అయితే ఈ సినిమా పూర్తి చేసి  టాలీవుడ్‌కి గుడ్‌బై చెప్పాలని ధనుష్ భావించడం లేదు అని తెలుస్తోంది. మరికొన్ని తెలుగు సినిమాలు కూడా చేయాలి అని ఆయన భావిస్తున్నారని సమాచారం.

ఈ క్రమంలో ఆయన వెంకీ అట్లూరి, అలాగే ఆర్ ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి స్క్రిప్ట్‌లు కూడా విన్నారట. అయితే అజయ్ భూపతిని కోలీవుడ్ ప్రేక్షకులకు నచ్చే విధంగా ఓ కథ రూపొందించాలి అని ధనుష్ కోరినట్లు.. దీంతో ఆయన ఆ పనిలో పడ్డారు అని అర్ధం అవుతోంది. ఇది ఇలా వుండగా ప్రస్తుతం శేఖర్ కమ్ముల ‘లవ్‌స్టోరీ’ పనుల్లో బిజీగా ఉండగా.. ధనుష్ ‘అత్రాంగి రే’, హాలీవుడ్‌ చిత్రం ‘ది గ్రే మ్యాన్‌’తో బిజీగా ఉన్నారు. దీని తర్వాత ధనుష్, శేఖర్ కమ్ములల సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనుంది.