పుష్ప మూవీ 10 కేజీఎఫ్ లతో సమానం!

director buchi babu about puspha movie

అల్లు అర్జున్- సుకుమార్ ఈ కాంబినేషన్ లో సినిమా అంటే ఫ్యాన్స్ కి పండగ అనే చెప్పుకోవాలి. అప్పట్లో యూత్ పై వీరి ఆర్య సిరీస్ సినిమాలు ఎంతగానో ప్రభావం చూపాయి. ఇక అక్కడ నుండి బన్నీ, సుక్కు ఇద్దరు కూడా తమ కెరీర్స్ పరంగా టాప్ రేంజ్ లోకి వెళ్లిపోయారు. ఇప్పుడు వీరి కాంబినేషన్ లోనే పుష్ప మూవీ తెరకెక్కుతోంది. ఈ పాన్ ఇండియా మూవీ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందకు రానుంది. భారీ బడ్జెట్‌ తో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కతోన్న పుష్పపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు వారి అంచనాలను 10 ఇంతలు చేస్తూ.., సుకుమార్ శిష్యుడు, ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు పుష్ప మూవీపై సంచలన కామెంట్స్ చేశాడు.

Buchi Babu about puspha movieఉప్పెన సినిమాతో తిరుగులేని విజ‌యాన్ని న‌మోదు చేసుకున్నాడు నూతన దర్శకుడు బుచ్చిబాబు సాన. డెబ్యూ మూవీనే మంచి విజయం సాధించడంతో ఈ డైరెక్టర్ పై హీరోలు, నిర్మాత‌ల క‌న్నుప‌డింది. మొద‌టి సినిమాతోనే మాంచి వసూళ్లు రాబ‌ట్ట‌డంతో.. బుచ్చిబాబు ప్రేక్షకులకి కూడా బాగా రీచ్ అయ్యాడు. దీంతో.., బుచ్చి సోషల్ మీడియా సైట్స్ లో కూడా యాక్టీవ్ గా ఉంటూ వస్తున్నాడు. ఇక తాజాగా బుచ్చిబాబు క్లబ్ హౌస్ అనే యాప్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.

ఇక్కడ బుచ్చిబాబు పుష్ప సినిమాకి సంబంధించిన కొన్ని విషయాలను బయటపెట్టాడు. నేను పుష్ప పార్ట్-1 సినిమాను చూశాను. నాకు పుష్ప మొదటి భాగం ఒక్కటే 10 కేజీఎఫ్‌ సినిమాలతో సమానం అనిపించింది. హీరో ను చూపించిన విధానం, దర్శకుడు సుకుమార్ గారి ఎలివేషన్ మరో లెవల్‌ లో ఉంది. ఇందులో అల్లు అర్జున్ ని చూశాక ఫ్యాన్స్ ని పూనకాలే అని బుచ్చిబాబు చెప్పుకొచ్చాడు. దీంతో.., సుకుమార్ ఎంత అద్బుతంగా పుష్ప సినిమాను తెరకెక్కిస్తున్నారో ప్రేక్షకులకి మరో సారి క్లారిటీ వచ్చేసింది. ఇక బుచ్చిబాబు విషయానికి వస్తే.., మరో చిన్న సినిమాతో తనని తాను నిరూపించుకుని జూనియర్ యన్టీఆర్ తో ఓ సినిమా చేయాలన్న ప్లాన్ లో ఉన్నాడట బుచ్చి. కాకుంటే.., దీనికి మరో రెండేళ్ల సమయం పట్టేలా ఉంది. ఏదేమైనా.., తన గురువు సినిమాకి బుచ్చిబాబు ఇచ్చిన బిల్డప్ ఇప్పుడు పుష్ప పై అంచనాలను పెంచేసింది.