రామ్‌ చరణ్‌ సినిమాలో ఛాన్స్ కొట్టేసి బిగ్ బాస్ 5 ఇద్దరు కంటెస్టెంట్లు.?

తెలుగు బుల్లితెరపై వస్తున్న బిగ్‏బాస్ రియాల్టీ షోకు వస్తున్న రెస్పాన్స్ గురించి ప్రత్యకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ లో ఎంతో పాపులారిటీ సంపాదించిన బిగ్ బాస్ రియాల్టీ షో ఇప్పుడు తెలుగు,  తమిళ్, మలయాళం, కన్నడ భాషలల్లో కూడా మంచి క్రేజ్ సంపాదించింది. ఇక బిగ్ బాస్ షోలో పాల్గొన్న కంటెస్టెంట్లకు అదృష్టం భలే కలిసి వస్తుంది. బాలీవుడ్ లో ఇప్పటికే పలువురు కంటెస్టెంట్లు నటులుగా మారారు. ఇతే తంతు ఇతర భాషల్లో నడుస్తుంది.

bgadqj minఇక తెలుగు లో వస్తున్న బిగ్ బాస్ షోలో పాల్గొన్న కంటెస్టెంట్ల ఇండస్ట్రీలో మంచి ఆఫర్లు కొట్టేస్తున్నారు. ఈ సారి బిగ్ బాస్ షో 5వ సీజన్ మొత్తం 19 మందితో ప్రారంభమైంది. ప్రస్తుతం ఇంట్లో తొమ్మిది మంది ఇంటి సభ్యులు కొనసాగుతున్నారు. ఇక బిగ్‌బాస్‌ రియాలిటీ షో ప్రేక్షకులకు ఎంతలా వినోదాన్ని పంచుతుందో అందులో పాల్గొన్న కంటెస్టెంట్లకు మంచి అదృష్టాని తీసుకు వస్తుంది. బిగ్‌బాస్‌లో పాల్గొని బయటకు వచ్చిన వారిలో చాలా మంది సినిమాల్లో నటించే ఛాన్స్‌లు దక్కించుకున్నారు.

bigae min 1తాజాగా బిగ్‌బాస్‌ 5వ సీజన్‌లో పాల్గొన్న ఇద్దరు ఇంటి సభ్యులు లక్కీ ఛాన్స్‌ కొట్టేసినట్లు ఫిలిమ్ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ ఆ ఇద్దరు లక్కీ కంటెస్టెంట్లు ఎవరా అనుకుంటున్నారా? లోబో, విశ్వ. ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న కొత్త చిత్రంలో లోబో, విశ్వలు నటించనున్నట్లు సమాచారం. వీరిద్దరూ చెర్రీతో కలిసి దిగిన ఫోటోలు నెట్టింట వైరల్‌ కావడంతో ఈ వార్తకు బలం చేకూరినట్లైంది. ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.