ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ ఓటీటీకి ఇంకా కొద్దిరోజులే గడువు ఉంది. ఫిబ్రవరి 26న అట్టహాసంగా బిగ్ బాస్ ఓటీటీ ప్రారంభం కానుంది. బిగ్ బాస్ తెలుగు అంటే ఇప్పటి వరకు 5 సీజన్లు చూశారు కాబట్టి.. ప్రేక్షకులకు ఒక క్లారిటీ ఉంది. 24 గంటల్లో జరిగిన అన్ని విషయాల నుంచి ఆసక్తికర అంశాలను జోడిస్తూ రోజుకు గంట ఎపిసోడ్ ప్రసారం చేసేవారు. కానీ, 24 గంటలూ లైవ్ స్ట్రీమ్ జరుగుతూ ఉంటే ఎలా ఉండబోతోందో? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అలాంటి వారి కోసం బిగ్ బాస్ తెలుగు, బిగ్ బాస్ ఓటీటీ హిందీని పరిశీలించి ఒక అంచనా వేసే ప్రయత్నం చేద్దాం.
దాదాపుగా ఓటీటీ కూడా సాధారణ బిగ్ బాస్ తెలుగు సీజన్ మాదిరిగానే ఉండనున్నట్లు తెలుస్తోంది. కానీ, ప్రేక్షకులకు ఆసక్తి మిస్ కాకుండా ఉండేందుకు కాస్త డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో గంట ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు రోజంతా ఎదురుచూసిన రోజులు ఉన్నాయి. కానీ, ఇలా 24 గంటలు ప్రత్యక్ష ప్రసారం చేస్తే ఆ ఇంట్రస్ట్ ను క్యారీచేయగలరా? అనేది పెద్ద సవాలు. ఆ సమస్యను దాటేందుకు టీమ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలుస్తోంది. రోజూ ఏదొక టాస్క్, ఎంగేజ్ మెంట్, వ్యూయర్ ఇంట్రస్ట్ ను పెంచే కార్యక్రమాలు ఉండేలా జాగ్రత్త పడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. రోజును 3 భాగాలుగా విభజించే అవకాశం ఉంది. అవి ఎలా ఉండచ్చంటే.. 1) టాస్కులు, 2) ఇంటరాక్షన్ 3) విశ్రాంతి/పర్సనల్ ఇలా ఉండే అవకాశం ఉంది.
బిగ్ బాస్ లో గేమ్ ముందుకెళ్తున్న కొద్దీ టాస్కులు పెరుగుతుంటాయి. కానీ, ఓటీటీలో మాత్రం సీజన్ ప్రారంభం నుచే రసవత్తరంగా ఉండోబోతోందని చెబుతున్నారు. ఇప్పటికే హిందీలో ప్రసారం జరిగి ఆదరణ పొందిన ఐడియా కాబట్టే తెలుగులో కూడా పరిచయం చేస్తున్నారు. హిందీ బిగ్ బాస్ చూస్తే రోజులో ఎప్పుడూ ఒక టాస్కు ఉండేలా జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. టాస్కు సమయంలోనే కంటెస్టెంట్లు అగ్రెసివ్ గా ఉండటం, యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయడం చేస్తారు.
బిగ్ బాస్ గేమ్ మొత్తం వ్యక్తిత్వం మీదనే ఆధారపడి ఉంటుంది. అంటే ఒక వ్యక్తి ముక్కు మొఖం తెలియని వ్యక్తులతో దాదాపు 106 రోజులు ఉండాల్సి వస్తే ఎలా ఉంటాడు? వారితో ఎలా ముందుకెళ్తాడు? కొన్ని క్లిస్ట పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు? ఎలాంటి మాస్కు లేకుండా అన్ని సందర్భాల్లో ఎలా వ్యవహరిస్తాడు? అనేది బయటకు తీయడమే వారి ప్రధాన లక్ష్యం. ఓటీటీలోనూ అదే ఫార్ములా. అలా ఒకరినొకరు తెలుసుకోవాలంటే వారితో కొంత సమయం గడపాలి. ఈసారి ఓటీటీలో అందుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఎంత ఎక్కువ తెలుసుకుంటేనే అంత ఎక్కువ ఆసక్తిగా ఎపిసోడ్ సాగుతుంది కాబట్టి.
అంతేకాకుండా బిగ్ బాస్ హిందీ ఓటీటీలో జంటల కాన్సెప్ట్ ను పరిచయం చేశారు. మరి తెలుగులో అలా ఉండకపోవచ్చు. కానీ, ప్రతి సీజన్ లో కనీసం రెండు జంటలను అయినా చూస్తూ వచ్చిన ప్రేక్షకులను ఆ విషయంలో ఓటీటీలోనూ నిరుత్సాహ పరచరు అని తెలుస్తోంది. కొన్నిసార్లు బిగ్ బాస్ ప్రేమలు అన్నీ కట్టుకథలు అనే వాదన కూడా ఉంది. కానీ, ఇప్పుడు 24 గంటల ప్రసారంలో అసలు అవన్నీ క్రియేటెడ్ ఆ? నిజమైనా అని ప్రేక్షకులకు తెలుస్తుంది. ఇంక రోజులో వారికి విశ్రాంతి ఉంటుంది. కానీ, 24 గంటల స్ట్రీమింగ్ కాబట్టి.. ఎవరోఒకరు ప్రేక్షకుల కోసం కష్టపడే అవకాశం లేకపోలేదు. అది వారికి ఓట్లు పొందడం కోసం కావచ్చు.. లేదంటే యాజమాన్యం ప్లాన్ కూడా అయ్యుండచ్చు.
కెప్టెన్, టాస్కులు ఇలా దాదాపుగా బిగ్ బాస్ సీజన్ మాదిరిగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ, రెట్టింపు ఎంటర్ టైన్మెంట్ మాత్రం పక్కా అని యాజమాన్యం ధీమా వ్యక్తం చేస్తోంది. నియమాలు, టాస్కులు, పూర్తి వివరాలు తెలియాలంటే ఫిబ్రవరి 26 వరకు ఆగాల్సిందే. బిగ్ బాస్ ఓటీటీ మరింత ఆసక్తిగా ఉండబోతోందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.