బిగ్ బాస్-5 కంటెస్టెంట్ 12.. నటరాజ్ మాస్టర్ లైఫ్ స్టోరీ

Bigg Boss 5 Telugu Contestant Nataraj Master Biography in Telugu -Suman TV

తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 ఎట్టకేలకు మొదలైంది. బిగ్ బాస్-5 కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న కింగ్ నాగార్జున అందరికన్నా ముందుగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈసారి బిగ్ బాస్ హౌస్ ఎలా ఉందో.. ప్రేక్షకులకి క్లియర్ గా చూపించారు. ఇక సీజన్ 5 లో 12వ కంటెస్టెంట్‌గా సీనియర్ కొరియోగ్రాఫర్ నటరాజ్ మాస్టర్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

ప్రస్తుతం తెలుగులో ఉన్న చాలా మంది స్టార్ కొరియోగ్రాఫర్స్ కి నటరాజ్‌ మాస్టర్ గురువు అని చెప్పుకోవచ్చు. అసలు తెలుగులో డ్యాన్స్‌ రియాలిటీ షోలకు ఆద్యుడు కూడా ఈయనే. అప్పట్లో ఉదయభానుతో యాంకర్ గా డ్యాన్స్‌ బేబీ డ్యాన్స్‌ షో అనే ఓ షో వచ్చింది. దానికి కర్మ, కర్త, క్రియ అంతా ఈ నటరాజ్ మాస్టరే. 20 ఏళ్ళకి పై బడిన కెరీర్ లో నటరాజ్ మాస్టర్ ఇండస్ట్రీలో టాప్ హీరోలు, టాప్ డైరెక్టర్స్ అందరితో కలసి పని చేశారు.

Big Boss 01 copy min 1కృష్ణా జిల్లాకు చెందిన నటరాజ్ మాస్టర్ ది ప్రేమ వివాహం. 7 ఏళ్ళ పాటు ఓ అమ్మాయిని ప్రేమించి, చివరికి ఆమె మనసు గెలుచుకుని, ఇంట్లో వాళ్ళ సమక్షంలోనే వీరు వివాహం చేసుకోవడం విశేషం. ప్రస్తుతం నటరాజ్ మాస్టర్ భార్య 7 నెలల గర్భవతి. బిగ్ బాస్ ఆఫర్ కోసం.. ఇలాంటి స్థితిలో భార్యని ఒంటరిగా వదిలేసి వచ్చిన నటరాజ్ మాస్టర్ బిగ్ బాస్ సీజన్ 5 టైటిల్ విన్నర్ గా నిలవగలడు అని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.

(ముఖ్య గమనిక : అతి తక్కువ సమయంలో.. మాకు అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందించడం జరిగింది. త్వరలోనే మరింత సమాచారం అందిస్తాము)