తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 ఎట్టకేలకు మొదలైంది. బిగ్ బాస్-5 కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న కింగ్ నాగార్జున అందరికన్నా ముందుగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈసారి బిగ్ బాస్ హౌస్ ఎలా ఉందో.. ప్రేక్షకులకి క్లియర్ గా చూపించారు. ఇక సీజన్ 5 లో 11వ కంటెస్టెంట్‌గా హీరోయిన్ హమీదా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో.. ఇప్పుడు హమీదా వివరాలు తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు.
చాలా మంది తెలుగమ్మాయిలు లానే నటి హమీదా కూడా సినిమా ఇండస్ట్రీలో వెలిగి పోవాలని కలలు కనింది. కానీ.., ఈమెని ఒక్క మంచి అవకాశం కూడా వరించలేదు. చివరికి సాహసం సేయరా డింభకా సినిమాలో నటించింది ఈ బ్యూటీ. అయితే.., ఈ ప్రాజెక్ట్ కారణంగా హమీదా కెరీర్ కి ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది.ఇతర భాషల్లో సైతం తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రయత్నం చేసింది ఈ అమ్మడు. అయితే.., ఆ ప్రయత్నాలు ఏవి ఫలించలేదు. దీంతో.., చివరికి బిగ్ బాస్ హోస్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి అంగీకరించింది. మరి.. కెరీర్ ని బిల్డ్ చేసుకోవడానికి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన హమీదా ఈ సీజన్ టైటిల్ విన్నర్ గా నిలవగలదని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.
(ముఖ్య గమనిక : అతి తక్కువ సమయంలో.. మాకు అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందించడం జరిగింది. త్వరలోనే మరింత సమాచారం అందిస్తాము)