బిగ్ బాస్-5 కంటెస్టెంట్ 19.. యాంకర్ రవి లైఫ్ స్టోరీ

తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 ఎట్టకేలకు మొదలైంది. బిగ్ బాస్-5 కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న కింగ్ నాగార్జున.. అందరికన్నా ముందుగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈసారి బిగ్ బాస్ హౌస్ ఎలా ఉందో.. ప్రేక్షకులకి క్లియర్ గా చూపించారు. ఇక సీజన్ 5 లో చివరి కంటెస్టెంట్‌గా యాంకర్ రవి బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.

తెలుగు ప్రేక్షకులకి యాంకర్‌ రవి గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. సాధరణ కొరియోగ్రాఫర్ గా కెరీర్ ని ఆరంభించాడు రవి. అయితే.., తక్కువ సమయంలోనే యాంకర్ గా టర్న్ అయ్యాడు. ఆ తరువాత RVS అనే ఓ టీవీ ఛానెల్ లో ఫ్రీలాన్స్ యాంకర్ గా కొన్ని నెలలు పని చేశాడు. కానీ.., ఇక్కడ అతనికి పెద్దగా పేరు లేదు. ఈ క్రమంలో లాస్యతో కలిసి చేసిన సమ్‌థింగ్‌ స్పెషల్‌ ప్రోగ్రామ్‌ రవిని ఓవర్ నైట్ స్టార్ చేసేసింది. ఆ తరువాత రవి-లాస్య చాలా పోగ్రామ్స్ చేసి తమ క్రేజ్ పెంచుకున్నారు.

Bigg Boss 5 Telugu Contestant Anchor Ravi Biography in Telugu -Suman TVయాంకర్ గా రాణిస్తూనే రవి హీరోగా కూడా ఓ సినిమా చేశాడు. కానీ.., తనకి సినిమాలు వర్కౌట్ కావని త్వరగానే తెలుసుకుని, మళ్ళీ యాంకరింగ్ పై ద్రుష్టి పెట్టాడు. ఈ క్రమంలో వన్‌ షో, ఢీ జూనియర్స్‌, ఫ్యామిలీ సర్కస్‌, మొండి మొగుడు పెంకి పెళ్లాం, కిరాక్‌ సహా పలు షోలకు యాంకరింగ్‌ చేశాడు. రవి ప్రస్తుతం తన భార్య నిత్య సక్సేనా, కూతురు వియాతో కలసి యూట్యూబ్ వీడియోస్ కూడా చేస్తుండటం విశేషం. మరి.. రీల్ లైఫ్ లో ఇప్పటికే ఓ స్థాయికి చేరుకున్న రవి.. బిగ్ బాస్ సీజన్ 5 టైటిల్ విన్నర్ గా నిలవగలడు అని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.

(ముఖ్య గమనిక : అతి తక్కువ సమయంలో.. మాకు అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందించడం జరిగింది. త్వరలోనే మరింత సమాచారం అందిస్తాము)