అల వైకుంఠపురములో.. సరిలేరు నీకెవ్వరూ నిర్మాతలకు ఏపీ సర్కార్‌ షాక్‌..!?

AP CM Jagan Sensational Comments on Telugu Film Industry - Suman TV

సినిమా టికెట్లను ప్రభుత్వమే ఆన్‌లైన్‌లో అమ్మడం అనే అంశంపై చర్చలు జరుగుతున్నవిషయం తెలిసిందే. ఇప్పుడున్న పద్ధతిలో టికెట్లు అమ్మడం ద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతుందని ఏపీ పాలకుల భావిస్తున్నారు. ఆన్‌లైన్‌లో ప్రభుత్వమే సినిమా టికెట్లు అమ్మడం ద్వారా ప్రభుత్వ ఆదాయానికి నష్టం జరగకుండా ఉంటుందని వారి వాదన. ఈ క్రమంలో గతేడాది సంక్రాంతి సందర్భంగా విడుదలై బ్లాక్‌ బ్లాస్టర్లుగా నిలిచిన సినిమాలపై ప్రభుత్వం ట్యాక్స్‌ వేసినట్లు సమాచారం. అందులో త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నటించిన అల వైకుంఠపురములో.., అనిల్‌ రావిపుడి దర్వకత్వంలో సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలకు వచ్చిన కలెక్షన్లకు ఆ సినిమా నిర్మాతలు కట్టిన పన్నుకు సంబంధం లేదని ప్రభుత్వం తేల్చినట్లు తెలుస్తుంది.

AP CM Jagan Sensational Comments on Telugu Film Industry - Suman TVవాస్తవానికి అల వైకుంఠపురం సినిమా 87 కోట్లు, సరిలేరు నీకెవ్వరు సినిమా 83 కోట్లు ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే వసూలు చేసినట్లు ఆ చిత్రబృందాలే తెలిపాయని, భారీ వసూళ్లు రాబట్టి రికార్డులు నెలకొల్పినట్లు పేర్కొన్నాయని ఆ విధంగా చూసుకున్న ఒక్కొ సినిమా నుంచి 20 నుంచి 25 కోట్ల మేర ఆదాయం పన్ను రూపంలో ప్రభుత్వానికి రావాలని, 2020-21 ఏడాదికి మొత్తం అన్ని సినిమాలవి కలిపినా 40-45 కోట్లు మాత్రమే వచ్చాయని సమాచారం. దీంతో అల వైకుంఠపురములో చిత్ర నిర్మాణ సంస్థలు గీతా ఆర్ట్స్‌’, హారికా అండ్‌ హాసిని క్రిమేషన్స్‌ రూ.30 కోట్లు, సరిలేరు నీకెవ్వరు చిత్ర నిర్మాణ సంస్థలు శ్రీవెంటేశ్వర క్రిమేషన్స్‌, జీఎంబీ, ఏకే ఎంటరైమెంట్స్‌కు 20 కోట్లు పన్ను కట్టాల్సిందిగా ఏపీ సర్కారు ఆదేశాలు జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం.