తెలుగు సినీ పరిశ్రమలో విషాదం…ఉత్తేజ్ భార్య మృతి!!.

టాలీవుడ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు ఉత్తేజ్ భార్య అనారోగ్యం తో కన్నుమూశారు. ఉత్తేజ్ భార్య గత కొంతకాలం గా క్యాన్సర్ తో బాధపడుతున్నారు. అయితే ఇటీవల ఆరోగ్యం క్షీణించడంతో  ఈరోజు ఉదయం ఉత్తేజ్ భార్య కన్నుమూశారు. ఉత్తేజ్‌ చేసే పలు సేవా కార్యక్రమాల్లో పద్మావతి భాగం పంచుకునేవారు.    దాంతో ఆయన కుటుంబంలో విషాదం నిండుకుంది. ఉత్తేజ్ కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.  బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం 8 గంటల 30 నిముషాలకు ఆమె తుదిశ్వాస విడిచారు.

Uttej Wife Died - Suman TVపద్మావతి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. భార్య ఆకస్మిక మరణంతో ఉత్తేజ్‌, ఆయన కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. దీంతో ఉత్తేజ్‌కు, ఆయన కటుంబ సభ్యులకు సీనీ ప్రముఖులు, సహా నటీనటులు సంతాపం తెలుపుతున్నారు. ఇక  ఈ విషయం తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి, ప్రకాశ్‌ రాజ్‌ ,జీవిత రాశేఖర్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు ఉత్తేజ్‌ను పరామర్శించారు.

ఉత్తేజ్‌కి చేత‌న‌, పాట అనే ఇద్ద‌రు అమ్మాయిలు. చేత‌న ఓ సినిమాలో హీరోయిన్ గానూ చేసింది. ఉత్తేజ్ ఇటీవ‌ల ఓ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ స్థాపించారు. ఆ ఇనిస్టిట్యూట్ అడ్మినిస్ట్రేష‌న్ మొత్తం ప‌ద్మావ‌తి చూసుకునేవారు.  ఉత్తేజ్‌కి చెందిన వస్త్ర వ్యాపారాన్ని కూడా పద్మావతి నిర్వహించేవారు.  అయితే ఇప్పుడు స‌డ‌న్ గా కాన్స‌ర్ మ‌హ‌మ్మారి ఆమెని క‌బ‌ళించింది.