దసరా పండుగ సందర్భంగా బీజేపీ నేత బండారు దత్తాత్రేయ నిర్వహించిన అలాయ్ బలాయ్ కార్యక్రమం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ సారి ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనను చూసిన ఆనందంలో అభిమానులు.. చిరంజీవితో ఫోటో దిగడానికి ఎగబడ్డారు. ఈ విషయం కాస్త అక్కడే వేదిక మీద ఉన్న ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసిహరావుకి కోపం తెప్పించింది. దాంతో ఆయన బహరింగంగా చిరంజీవి మీద అసహనం ప్రకటించారు. గరికపాటి చేసిన వ్యాఖ్యలు […]
చిరంజీవి.. ఒక నటుడిగా తన ప్రయాణం ప్రారంభించి ఇప్పుడు మెగాస్టార్‌గా, అందరివాడిగా, అన్నయ్యగా, ఆయన ఒప్పుకోకపోయినా.. టాలీవుడ్ పెద్దన్నగా కొనసాగుతున్నారు. ఆయన చేసే సేవా కార్యక్రమాలు, ఆయన చేసిన సాయాలు లెక్కల్లో చెప్పమంటే జరిగే పని కాదు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం, ఔన్నత్యం కలిగిన వ్యక్తి. అలాంటి చిరంజీవిపై చిర్రుబుర్రులాడి ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు ఇప్పుడు ఎన్నో విమర్శలు, పెదవి విరుపులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. నేను చిరంజీవితో మాట్లాడతాను అంటూ గరికపాటి చెప్పినప్పటికీ.. […]
Uttej: తెలుగు చిత్ర సీమలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పదగ్గ వారిలో నటుడు ‘ఉత్తేజ్’ ఒకరు. ఆయన కేవలం నటుడిగానే కాదు.. మాటల రచయితగా కూడా తన సత్తా చాటారు. ఖడ్గం, నిన్నే పెళ్లాడతా వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలకు మాటలను అందించారు. ఇక, ఉత్తేజ్‌కు చిరంజీవి అంటే ఎనలేని అభిమానం. చిరును దైవ సమానులుగా భావిస్తుంటారు. వీలు చిక్కినప్పుడల్లా చిరుపై ఉన్న అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు. సోమవారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని చిరుపై ఓ […]
Chiranjeevi: వెండి తెర ‘ఇంద్రసేనుడు’ మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు నేడు. మెగాస్టార్ పుట్టిన రోజు సందర్భంగా అన్ని వర్గాలకు చెందిన ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు ఉత్తేజ్ కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక, ఇండస్ట్రీలో చిరంజీవిని స్పూర్తిగా తీసుకునే వారిలో ఉత్తేజ్ ఒకరు. చిరుకు ఉత్తేజ్‌కు మధ్య మంచి అనుబంధం ఉంది. తనకు చిరుతో ఉన్న అనుబంధానికి.. చిరుపై ఉన్న అభిమానానికి గుర్తుగా ఓ మంచి కవితతో ఉత్తేజ్ శుభాకాంక్షలు తెలియజేశారు. […]
ఇటీవల కాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులు ఒక్కొక్కరుగా మరణిస్తున్నారు. ఇటీవల కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టార్ మరణాన్ని జీర్ణించుకోక ముందే ప్రముఖ పాటల రచయితగా పేరు గాంచిన సిరివెన్నెల సీతారామాశాస్త్రి కన్నుమూశారు. ఇటీవల న్యూమోనియాతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. సిరివెన్నెల మరణాన్ని జీర్ణించుకోలేక ఆయన అభిమానులు కన్నీటి సంద్రంలో మునిగిపోతున్నారు. అయితే తెలుగు సినీవినీలాకాశంలో ఎన్నో పాటలు అందించిన సిరివెన్నెల మరణం విషయం తెలియడంతో అటు రాజకీయం […]
“మా” ఎన్నికలు ముగిసినా.., “మా” లో వేడి మాత్రం ఇంకా తగ్గడం లేదు. ఇక మంచు విష్ణు విజయం తరువాత రాజీనామాలా పర్వం కొనసాగుతూనే ఉంది. ఒకవైపు విష్ణు ఎవరి రాజీనామాలు ఆమోదించను అందర్నీ కలుపుకుని పోతాను అంటూ చెప్తున్నా, పరిస్థితిల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఇక తాజాగా ప్రకాశ్ రాజ్ ప్యానెల్ మొత్తం మరోసారి మీడియా ముందుకి వచ్చింది. తమ ప్యానెల్ లో గెలిచిన 11 మంది మెంబర్స్ ఆయా పదవులకు రాజీనామా చేస్తునట్టు […]
ఫిల్మ్ డెస్క్- జీవితంలో అన్ని విధాలుగా సెటిల్ అవుతన్న సమయంలో భార్య వియోగం అనేది చాలా దుర్భరమని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. నటుడు ఉత్తేజ్ సతీమణి పద్మావతి చనిపోవడం అందరిని కలచివేసిందని ఆయన ఆవేధన వ్యక్తం చేశారు. ఉత్తేజ్ ఇంట కొన్ని రోజుల క్రితం తీవ్ర విషాదం నెలకొన్న సంగతి అందరికి తెలిసిందే. ఆయన సతీమణి పద్మావతి ఈ నెల 13న క్యాన్సర్ తో మృతి చెందారు. గురువారం హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లో పద్మావతి సంస్మరణ […]
ప్రముఖ నటుడు ఉత్తేజ్ కుటుంబంలో విషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన భార్య పద్మావతి అనారోగ్యంతో సోమవారం కన్నుమూశారు. ఇటీవల క్యాన్సర్ బారిన పడిన ఆమె బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం(సెప్టెంబర్ 13) తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలిసి మెగాస్టార్ చిరంజీవి హుటాహుటిన బసవతారకం ఆసుపత్రికి చేరుకున్నారు. అనంతరం ఉత్తేజ్‌ను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. భార్య మరణంతో పుట్టెడు దుఖంలో ఉన్న ఉత్తేజ్ చిరును చూడగానే ఒక్క సారిగి తీవ్ర భావోద్వేగానకి […]
టాలీవుడ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు ఉత్తేజ్ భార్య అనారోగ్యం తో కన్నుమూశారు. ఉత్తేజ్ భార్య గత కొంతకాలం గా క్యాన్సర్ తో బాధపడుతున్నారు. అయితే ఇటీవల ఆరోగ్యం క్షీణించడంతో ఈరోజు ఉదయం ఉత్తేజ్ భార్య కన్నుమూశారు. ఉత్తేజ్ చేసే పలు సేవా కార్యక్రమాల్లో పద్మావతి భాగం పంచుకునేవారు. దాంతో ఆయన కుటుంబంలో విషాదం నిండుకుంది. ఉత్తేజ్ కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో చికిత్స […]