తిప్పతీగతో తప్పే ముప్పు మీకు తెలుసా!?.

కరోనా వైరస్ వచ్చినప్పటి నుంచి అంతా రోగనిరోధక శక్తిని పెంచుకోవడంపై ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే రోగనిరోధక శక్తిని పెంచే పదార్థాలపై కూడా ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఆయుర్వేద డాక్టర్లు ఓ ఆకును సూచిస్తున్నారు. దీనిని గుడూచి, అమృత అని కూడా పిలుస్తారు. ఈ ఆకులో ఎన్నో వైద్య లక్షణాలు ఉన్నాయి. దాన్నే సాధారణంగా మనం తిప్పతీగ అని పిలుస్తుంటాం.

thippa theega

తిప్పతీగను ఉపయోగించి జ్యూస్, పౌడర్, కాప్సూల్స్ తయారుచేస్తారు. ఇవన్నీ కూడా కొన్ని రకాల వ్యాధులను నయం చేయడానికి బాగా ఉపయోగపడతాయి. ఇది ఎక్కువగా గ్రామాల్లో కనిపిస్తుంది. కషాయంలా చేసుకుని తాగడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుంది. తిప్పతీగలో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడగలవు.

అలాగే శరరీంలోని కణాలు దెబ్బతినకుండా ఉండేందుకు వ్యాధుల బారినపడకుండా ఉండేందుకు తిప్పతీగ బాగా పని చేస్తుంది. తిప్పతీగ ఆకులను బాగా నూరి ముద్దలా చేసుకోవాలి. అలా చేసిన ముద్దను చిన్నసైజు గోళీలులా ఉండలు చేసుకోవాలి. ఈ గోళీలను పది రోజుల పాటు ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఇలా చేస్తే కచ్చితంగా మనలో రోగనిరోధకశక్తి బాగా పెరుగుతుందని వెల్లడిస్తున్నారు.

అజీర్తి సమస్యతో కాస్త తిప్పతీగ పొడిని బెల్లంలో కలుపుకుని తింటే చాలు. అజీర్తి సమస్య పోతుంది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరచగల శక్తి తిప్పతీగకు ఉంది. శ్వాసకోశ వ్యాధులతో బాధపడేవారికి తిప్పతీగ మందులు బాగా పని చేస్తాయి. దగ్గు, జలుబు, టాన్సిల్స్ వంటి శ్వాసకోశ సమస్యలను తగ్గించగల గుణాలు దీనిలో ఉన్నాయి. వృద్ధాప్య ఛాయలు రాకుండా  ముఖంపై మచ్చలు, మొటిమలు రాకుండా, ముడతలు ఏర్పడకుండా చేయగల ప్రత్యేక గుణాలు తిప్పతీగలో ఉంటాయి.

గర్భిణీలు, పాలిచ్చే తల్లులు తిప్పతీగతో తయారుచేసిన మందులను వాడకూడదు.

మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.