ఇటీవల చాలా మంది ప్రతి చిన్న విషయానికి క్షణికావేశంలో దారుణమైన నిర్ణయాలు తీసుకొని ఆత్మహత్యలకు పాల్పపడుతున్నారు. ఎంతో మంచి భవిష్యత్ ఉన్న వారు మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబాల్లో విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నం గ్రామానికి చెందిన ఆనందయ్య తయారు చేస్తోన్న కరోనా మందు ఉచిత పంపిణీ కార్యక్రమం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. కరోనా మందుకు తెలుగు రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉంది. అయితే కొందరు అక్రమార్కులు తన కరోనా మందుకు నకిలీ మందు తయారు చేసి అమ్ముకుంటున్నట్లు ఆనందయ్య ఆరోపించారు. కొందరు తయారు చేస్తున్న నకిలీ మందు వికటిస్తే దానికి తాను బాధ్యుడిని కానని ఆనందయ్య హెచ్చరించారు. ఆనందయ్య మందు అంటూ మార్కెట్లోకి వచ్చేసిన నకిలీ […]
కరోనా వల్ల వేల సంఖ్యలో ఆన్లైన్ కొనుగోళ్ల ఆర్డర్స్ చేస్తున్నారు. అదే స్థాయిలో మోసాలు కూడా పెరుగుతున్నాయి. కరోనా నివారణకు మూలికలు పనిచేస్తాయి అని నమ్మించి సైబర్ కేటుగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. ‘గింగో’ అనే తైలంతో కరోనాను నివారించొచ్చని అది తమ వద్ద దొరుకుతుందని ప్రచారం చేసుకుంటూ హైదరాబాద్‌కు చెందిన ఓ ఫార్మా కంపెనీ ప్రతినిధిని అలాగే ఓ ఆయుర్వేదిక్ వైద్యురాలని నిండా ముంచారు నైజీరియన్ చీటర్స్. మెహదీపట్నంలో ఉంటున్న ఒక ఆయుర్వేదిక్ వైద్యురాలికి ఫోన్ చేసిన […]
ఇప్పుడు దేశవ్యాప్తంగా సెన్సేషన్. రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే హాట్ టాపిక్. కరోనా విలయం కొనసాగుతున్న నేపథ్యంలో ఆనందయ్య నాటు మందుతో కరోనా తగ్గిపోతుందన్న వార్త దేశమంతటా పాకి అటు కేంద్ర ప్రభుత్వాన్ని, ఇటు రాష్ట్రప్రభుత్వాన్ని కృష్ణపట్నం వైపు చూసేలా చేసింది. ఈ మందును పంపిణీ చేయాలని కూడా ఇటీవలే ఏపీ సర్కార్, హై కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ఈ నేపథ్యంలో టీటీడీ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఆనందయ్య మందును టిటిడి ఉద్యోగులకు కూడా […]
కరోనా వైరస్ వచ్చినప్పటి నుంచి అంతా రోగనిరోధక శక్తిని పెంచుకోవడంపై ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే రోగనిరోధక శక్తిని పెంచే పదార్థాలపై కూడా ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఆయుర్వేద డాక్టర్లు ఓ ఆకును సూచిస్తున్నారు. దీనిని గుడూచి, అమృత అని కూడా పిలుస్తారు. ఈ ఆకులో ఎన్నో వైద్య లక్షణాలు ఉన్నాయి. దాన్నే సాధారణంగా మనం తిప్పతీగ అని పిలుస్తుంటాం. తిప్పతీగను ఉపయోగించి జ్యూస్, పౌడర్, కాప్సూల్స్ తయారుచేస్తారు. ఇవన్నీ కూడా కొన్ని రకాల వ్యాధులను […]
నెల్లూరు జిల్లా కృష్ణపట్నం గ్రామానికి చెందిన ఆనందయ్య తయారు చేస్తోన్న కరోనా మందు పంపిణీ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఆనందయ్య మందుకు టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు బ్రాండ్ అంబాసిడర్ గా మారారు. తాను ఆనందయ్య మందు అందరికంటే ముందే తీసుకున్నానని.. తనకు కరోనా రాలేదని ప్రకటించారు. ఆయన మాటలతో ప్రజల్లో ఆనందయ్య మందుపై మరింత నమ్మకం పెరిగింది. నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలో ఆనందయ్య ఔషధం పంపిణీ చేస్తున్నారు. వాలంటీర్లు ఇంటింటికీ తిరుగుతూ ఈ […]
అతి తక్కువ ధరలో కరోనా డ్రగ్ తయారు చేయడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. కరోనా సెకండ్ వేవ్‌తో అల్లాడిపోతున్న దేశాన్ని ఆదుకునేందుకు ఆసియా బిలియనీర్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ ముందుకు వచ్చారు. ఇందుకోసం నిక్లోసమైడ్ అనే టేప్‌వార్మ్ (నారిపురుగు) డ్రగ్‌ను ఉపయోగించాలని భావిస్తోంది. కరోనా టెస్ట్ కోసం ఈ కంపెనీ ఆర్–గ్రీన్, ఆర్–గ్రీన్ ప్రో పేరుతో తయారు చేసిన చవక కిట్స్ కు ఇది వరకే ఐసీఎంఆర్ నుంచి పర్మిషన్లు వచ్చాయి. […]
కరోనా వైరస్ నేపథ్యంలో కృష్ణపట్నం ఆనందయ్య మందు ఎంతగా ఫేమస్ అయ్యిందో తెలిసిందే. కోవిడ్-19 రోగుల ప్రాణాలు రక్షిస్తున్న ఆ మందు వెనుక రహస్యాన్ని తెలుసుకుని ఆయుష్ విభాగం, ఆయుర్వేద నిపుణులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ మందులో ఆయన ఉపయోగిస్తున్న మూలికలు, పదార్థాల్లో ఏవీ హానికరం కాదని నిర్ధరించారు. కంటిలో వేసే మందు తప్ప మిగతావన్నీ రోగులకు అందివచ్చని షరతు విధించింది. కంట్లో వేసే మందుపై ఇంకా నివేదికలు రావాల్సి ఉన్నందున మిగతా ఔషదాలకు […]
ఆనందయ్య మందుల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చిన విషయం తెలిసిందే. అయితే కరోనా నిబంధనలు పాటిస్తూనే పంపిణీ చేయాలని ప్రభుత్వం షరతు విధించింది. ఇతర రాష్ట్రాల నుండి వేల సంఖ్యలో జనం ఎగబడి వస్తున్నారు. సోషల్ డిస్టెన్స్ మెయిన్ టెయిన్ చేయడం చాలా కష్టతరం అని గతంలోని పరిస్థితులు చెబుతున్నాయి. ప్రభుత్వం కూడా అనుమతి ఇస్తూనే కరోనా నిబంధనలు పాటిస్తూ పంపిణీ చేయాలని చెప్పడంతో ఆనందయ్య మందుల తయారీ కూడా సవాల్ గా మారింది. కృష్ణపట్నం ఆనందయ్య […]
ఆనందయ్యకు రోజురోజుకూ ప్రముఖుల నుంచి మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే ప్రముఖ నటుడు జగపతిబాబు ఆయనను ప్రశంసించారు. ప్రముఖ మత గురువు కేఏ పాల్ కూడా ఆనందయ్యకు మద్దతుగా నిలిచారు. ఆనందయ్య కనిపెట్టిన ఆనందయ్య మందు దేవుడిచ్చిన వరమని పేర్కొన్నారు. ఆనందయ్యతో తాను కొన్ని గంటల క్రితమే మాట్లాడానని, ప్రస్తుతం ఆయన పోలీసుల వలయం ఉన్నారని చెప్పారు. ఈ మేరకు కేఏ పాల్ అమెరికా నుంచి వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. ప్రైవేట్ ఆసుపత్రులు ఘోరంగా దోచుకుంటున్నాయన్నారు. తన […]