ఇటీవల చాలా మంది ప్రతి చిన్న విషయానికి క్షణికావేశంలో దారుణమైన నిర్ణయాలు తీసుకొని ఆత్మహత్యలకు పాల్పపడుతున్నారు. ఎంతో మంచి భవిష్యత్ ఉన్న వారు మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబాల్లో విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.
ఈ మద్య చిన్న వివాదాలకే చాలా మంది ఆత్మహత్యలకు పాల్పపడుతూ.. కుటుంబ సభ్యులకు కన్నీరు మిగుల్చుతున్నారు. పని ఒత్తిడి, ప్రేమ వ్యవహారాలు ఇతర కారణాలు ఏవైనా.. నిండు జీవితాలను క్షణికావేశంలో బలిచేసుకుంటున్నారు. తో మంచి భవిష్యత్ ఉన్న ఓ మెడికో విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో చనిపోవడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
విజయవాడలో విషాదం చోటు చేసుకుంది. ఓ మెడికో విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఆ యువతి మరణం పలు అనుమానాలకు తావిస్తుంది. జంగారెడ్డి గూడెం నోవా కాలేజ్ లో ఫార్మా – డి ఫైనల్ ఇయర్ చదువుతుంది శృతి. బుధవారం తన ఇంట్లో మంచంపై నురుగ కక్కుతూ ఆపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. వెంటనే ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు తల్లిదండ్రులు. పరిస్థితి విషమించడంతో గురువారం ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందింది శృతి. అయితే శృతి మరణంపై భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. క్లాస్ మెంట్ అంటూ ఓ వ్యక్తి కాల్ చేసి శృతితో మాట్లాడారని.. ఆమె తండ్రి చెబుతున్నారు. ఆరోగ్యం బాగాలేక శృతి చనిపోయిందని.. అనారోగ్య సమస్యల కారణంగా చనిపోయిందని బంధువులు అంటున్నారు.
జంగారెడ్డి గూడెంలో జూనియర్ డాక్టర్ గా విధులు నిర్వహిస్తుంది శృతి. మరో మూడు నెలల్లో చదువు పూర్తి చేసుకొని పట్టా తీసుకోవాల్సిన విద్యార్థిని ఇలా విగతజీవితా మారిపోవడం కలకలం రేపింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇదిలా ఉంటే మృతురాలి కుటుంబం నుంచే పొంతన లేని సమాధానాలు రావడంతో కేసు ని సీరియస్ గా తీసుకున్నారు పోలీసులు. శృతి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన అనంతరం.. అలాగే కాల్ డేటా తీస్తే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు అంటున్నారు. శృతి ఆత్మహత్య చేసుకుందా? నిజంగా అనారోగ్యంతో సమస్యలతో చనిపోయిందా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు పోలీసులు.