పంజాబ్‌ను భయపెట్టిన అంబటి రాయుడు! ఆ విషయంలో అట్టర్‌ఫ్లాప్‌

Ambati Rayudu who terrorized Punjab

ఐపీఎల్‌ 2022లో సోమవారం పంజాబ్‌ కింగ్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ చివరి ఓవర్‌ వరకు ఉత్కంఠభరితంగా సాగింది. ఈ మ్యాచ్‌ను పంజాబ్‌ 11 పరుగుల తేడాతో గెలిచింది. చెన్నై బ్యాటర్లను పంజాబ్‌ బౌలర్లు తమ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో నిలువరించడంతో ఈ సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌ నాలుగో విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్‌లో చెన్నై బ్యాటర్‌ అంబటి రాయుడు సూపర్‌ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో చెన్నైను గెలిపించేలా కనిపించాడు. 39 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సులతో 78 పరుగులు చేసి.. రబడా వేసిన ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌లో అవుట్‌ అయ్యాడు.

ఈ ఇన్నింగ్స్‌పై అంబటి రాయుడిపై ప్రశంసల వర్షం కురుస్తుంది. కానీ.. ఒక విషయంలో రాయుడు మరింత మెరుగుపడాలని క్రికెట్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బ్యాటింగ్‌ విషయంలో సూపర్‌గా ఆడుతున్న రాయుడు.. సరైన ఫిట్‌నెస్‌లేక ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తుంది. పంజాబ్‌తో మ్యాచ్‌లో మంచి ఇన్నింగ్స్‌ ఆడిన రాయుడు.. రెండు పరుగులు తీయలేక ఒక పరుగుతోనే సరిపెట్టుకుంటున్నాడు. నాన్‌స్ట్రైయికర్‌ ఎండ్‌లో జడేజా ఉన్నా.. కూడా రెండు పరుగులు రావాల్సిన చోట ఒక్క పరుగే వచ్చింది. ఇది రాయుడు అలసిపోయిన పరిగెత్తలేకపోవడంతోనే ఇలా జరిగిందని క్రికెట్‌ పండితులు సైతం విమర్శిస్తున్నారు.

 Ambati Rayudu who terrorized Punjab

నిజానికి రాయుడు అలసటతోనే తన వికెట్‌ పారేసుకున్నాడు. అలా కాకుండా ఫిట్‌గా ఉండి ఉంటే.. రాయుడు చివరి వరకు బ్యాటింగ్‌ చేసే వాడు. దీంతో ఫలితం వేరేలా ఉండేది. కానీ.. 39 బంతులు మాత్రమే ఆడిన రాయుడు అలిసిపోయి పరుగులు తీసేందుకు ఇబ్బంది పడ్డాడు. ఇలా టీ20 క్రికెట్‌లోనే ఇంతలా అలిసిపోతే టెస్టు క్రికెట్‌లో రాయుడు ఎంత మేర రాణిస్తాడనేది అనుమానమే. రాయడు.. తన ఫిట్‌నెస్‌పై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైన ఉందని ఫ్యాన్స్‌ కూడా సోషల్‌ మీడియాలో వేదికగా కామెంట్‌ చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: పంజాబ్‌ బౌలర్‌ రిషీ ధావన్‌ ఫేస్‌కు సెఫ్టీ షీల్డ్‌ ఎందుకు పెట్టుకున్నాడు?

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.