టీమిండియా క్రికెటర్ అంబటి రాయుడు అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. రిటైర్మెంట్ తర్వాత తన పొలిటికల్ కెరీర్ నిర్మాణంపై ఫోకస్ పెంచుతున్నాడీ తెలుగు క్రికెటర్. ఈ క్రమంలో వైసీపీ పార్టీతో అతడు టచ్‌లోకి వెళ్లడం, సీఎం జగన్‌ను పలుమార్లు కలవడం తెలిసిందే. అయితే రాయుడు వైసీపీలో చేరడానికి చంద్రబాబు మీద ఉన్న కోపమే కారణమనే వాదన వినిపిస్తోంది.
తెలుగు గడ్డపై నుంచి సీకే నాయుడు నుంచి మొదలుకొని మహ్మద్ అజహరుద్దీన్ వరకు ఎంతో మంది గొప్ప క్రికెటర్లు భారత జట్టుకు ఆడారు. బ్యాటర్లుగా, బౌలర్లుగా అద్భుతంగా రాణించడమే గాక కెప్టెన్లుగానూ నేషనల్ టీమ్‌ను ముందుండి నడిపించారు. తెలుగు ప్రజలు గర్వించదగ్గ గొప్ప క్రికెటర్లలో అంబటి రాయుడు కూడా ఒకడు. బ్యాటర్‌గా జాతీయ జట్టుకు అతడు అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయనే చెప్పాలి. టీమ్ కష్టాల్లో ఉన్న చాలా సమయాల్లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడి విజయాల్లో ముఖ్య పాత్ర పోషించాడు రాయుడు. టీమిండియా తరఫున బ్యాటర్‌గా ఎంత పేరు తెచ్చుకున్నాడో.. అంతకు ఎక్కువ పేరు ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌కు ఆడి సంపాదించాడు. సీఎస్కే జట్టు ఈ ఏడాది టైటిల్ గెలవడంలోనూ తనదైన పాత్ర పోషించాడు రాయుడు.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు రాయుడు అందించిన సేవల్ని గుర్తిస్తూ కప్ తీసుకునే టైమ్‌లో తనకు బదులు అతడ్ని పంపాడు ధోని. ఇక, ఐపీఎల్-2023తో అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన రాయుడు.. హఠాత్తుగా రాజకీయాలపై ఫోకస్ పెట్టాడు. అంతేగాక నేరుగా వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసి అందరికీ షాక్ ఇచ్చాడు. వైసీపీలో రాయుడి చేరిక దాదాపుగా లాంఛనమేనని అంటున్నారు. ఈ స్టార్ క్రికెటర్ వైసీపీలో చేరడంలో తప్పు లేదు. కానీ పొలిటికల్ కెరీర్ గురించి ఆలోచన రాగానే నేరుగా వైసీపీలోకి వెళ్లడం.. విపక్ష పార్టీ అయిన టీడీపీ వైపు అతడు కన్నెత్తి కూడా చూడకపోవడంపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనికి టీమిండియా మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ కారణమనే వాదనలు వస్తున్నాయి.
బయటికి కనిపించకున్నా తెలుగు దేశం పార్టీతో ఎంఎస్కే ప్రసాద్ సత్సంబంధాలు కలిగి ఉన్నారనే రూమర్ ఉంది. బీజేపీతోనూ ఆయనకు మంచి రిలేషన్స్ ఉన్నాయట. ఎంఎస్కే ప్రసాద్ 2016 నుంచి 2020 వరకు దాదాపు 4 సంవత్సరాలు పాటు భారత జట్టు చీఫ్ సెలెక్టర్‌గా ఉన్నారు. ఆ టైమ్‌లో ఏపీలో చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వం, కేంద్రంలో మోడీ లీడర్‌షిప్‌లోని బీజేపీ సర్కారు అధికారంలో ఉన్నాయి. అప్పట్లో చంద్రబాబుతో పాటు వెంకన్న నాయుడు మద్దతు పుష్కలంగా ఉండటంతో ఎంఎస్కేను చీఫ్ సెలెక్టర్ పదవి వరించిందని రూమర్స్ వచ్చాయి. భారత జట్టు తరఫున ఎంఎస్కే ప్రసాద్ పెద్దగా రాణించకున్నా, స్టార్ ప్లేయర్ కాకపోయినా.. కేవలం పొలిటికల్ సపోర్ట్‌తోనే ఆయన బీసీసీఐలో చక్రం తిప్పారనే వాదన ఉంది.
ఎంఎస్కే ప్రసాద్ చీఫ్ సెలెక్టర్‌గా ఉన్న సమయంలో వన్డే వరల్డ్ కప్-2019 జరిగింది. ఆ టోర్నీ ముందు వరకు అద్భుతంగా ఆడిన రాయుడ్ని ప్రపంచ కప్ టీమ్‌లోకి తీసుకోలేదు. రాయుడి ఎంపిక విషయంలో ఎంఎస్కేదే తప్పు అన్నట్లు అన్ని వేళ్లు ఆయన వైపే చూపించాయి. తన కెరీర్‌ను ఎంఎస్కే ప్రసాద్ నాశనం చేశాడనే కోపం రాయుడిలో కూడా ఉందని విశ్లేషకులు అంటున్నారు. అదే టైమ్‌లో టీడీపీ కోటరీకి ఎంఎస్కే దగ్గరగా ఉంటాడని.. చంద్రబాబుతోనూ ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే వాదన నడుస్తోంది. తన కెరీర్ విషయంలో చంద్రబాబు ప్రమేయం లేకపోయినా.. టీడీపీకి, ఆ పార్టీ అధినేతకు ఎంఎస్కే ప్రసాద్ దగ్గరగా ఉంటాడనే రూమర్ ఉండటంతో సెకండ్ థాట్ అనేది లేకుండా వైసీపీలో జాయిన్ అవ్వాలని రాయుడు డిసైడ్ అయ్యారనే వాదన వినిపిస్తోంది. టీడీపీపై వ్యతిరేకతతోనే డైరెక్ట్‌గా వైసీపీతో అతడు టచ్‌లోకి వెళ్లారని సమాచారం. మరి.. రాయుడు పొలిటికల్ ఎంట్రీపై వస్తున్న ఊహాగానాల విషయంలో మీరు ఏం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.