‘సన్‌రైజర్స్ హైదరాబాద్’ పేరు వినపడగానే క్రికెట్ అభిమానులకు గుర్తొచ్చే మొదటి పేరు డేవిడ్ వార్నర్. బ్యాట్స్‌మన్‌గా, కెప్టెన్‌గా హైదరాబాద్ టీమ్ కోసం అతను చేసిన కృషిని అభిమానులు ఇప్పటికీ కొనియాడుతూనే ఉంటారు. కానీ, ఐపీఎల్ 2021 సీజన్‌లో హైదరాబాద్ టీమ్‌లో డేవిడ్ ప్రదర్శన, అతని స్థానం ప్రశ్నార్థకంగా మారాయి. జట్టు అతడ్ని వద్దనుకున్నా.. జట్టును మాత్రం అతడు ఎప్పుడూ వద్దనుకోలేదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. జట్టు కోసం డ్రింక్స్ మోసిన డేవిడ్ వార్నర్.. ఇప్పుడు అసలు గ్రౌండ్‌లో కూడా కనిపించకపోయే సరికి అభిమానుల్లో కలవరం, అనుమానాలు మొదలయ్యాయి. అసలు టీమ్‌లో అయినా ఉంటాడా? లేదా అని ప్రశ్నిస్తున్నారు.
సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ రాజస్థాన్ రాయల్స్‌పై ఘన విజయం సాధించింది. కేన్ మామ హాఫ్ సెంచరీతో అలరించాడు. జేసన్ రాయ్ మెరుపు ఇన్నింగ్స్ అందరినీ కట్టి పడేసింది. ఆ మ్యాచ్‌లో అంత గొప్ప ప్రదర్శన చేసిన హైదరాబాద్ టీమ్‌ను ప్రశంసించకపోగా అభిమానులు అడుగుతున్న ప్రశ్న డేవిడ్ ఎక్కడ? అసలు మైదానంలో అయినా ఉన్నాడా? మాకు ఎందుకు కనిపించలేదు. అని అడగటం మొదలు పెట్టారు. అలా సోషల్ మీడియాలో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు వార్నర్ నేరుగా సమాధానం చెప్పాడు. ‘దురదృష్టవశాత్తు ఇంక కనిపించకపోవచ్చు.. కానీ, సపోర్ట్ చేస్తూ ఉండండి’ అంటూ వార్నర్ ఇచ్చిన రిప్లై చూసి అందరూ షాకయ్యారు. ఇక వార్నర్ ఆరెంజ్ జెర్సీ వేసుకోడేమో అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఐపీల్ పుణ్యామా అని వార్నర్‌కు హైదరాబాద్, ఇండియాతో విడదీయరాని బంధం ఏర్పడింది. అతను ఎప్పుడూ భారతదేశాన్ని తన ఇంటిగానే భావిస్తాడు. ఒక్క ఆస్ట్రేలియా మినహా ఏ దేశంతో టీమిండియా మ్యాచ్ ఆడుతున్నా.. అతను డౌట్ లేకుండా భారత్‌కే మద్దతు తెలుపుతాడు. తెలుగువారితో వార్నర్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. ఐపీఎల్ లేకపోయినా.. సోషల్ మీడియా వేదికగా వార్నర్ ఎప్పుడూ తెలుగువారితో టచ్‌లో ఉంటాడు. ఆరంజ్ ఆర్మీ అభిమానులకు ఇన్‌స్టాలో రిప్లయిలు ఇస్తూ ఉత్సాహపరుస్తాడు. తెలుగులో అందరు అగ్రహీరోలా పాటలకు డాన్సులు, ఫేస్ యాప్‌తో సినిమా సీన్స్ చేసిన వార్నర్ తెలుగువారి అభిమానాన్ని చూరగొన్నాడు.
2014లో డేవిడ్ వార్నర్ హైదరాబాద్ టీమ్‌లోకి ఎంటర్ అయ్యాడు. 2015లోనే వార్నర్‌కు హైదరాబాద్ టీమ్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు. అదే జోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు తొలి ఐపీఎల్ ట్రోఫీని అందించింది వార్నరే. 2014లో 528 పరుగులు, 2015లో 562, 2016లో 848, 2017లో 641, 2019లో 692, 2020లో 548 పరుగులు చేశాడు వార్నర్. వరుసగా ఆరు సంవత్సరాలు 500 పరుగులు పైగా సాధించాడు. మూడుసార్లు ఆరంజ్ క్యాప్ సాధించాడు. 2021లో 8 మ్యాచ్‌లలో 107.73(వార్నర్ కెరీర్‌లోనే అత్యల్పం) స్ట్రైక్ రేట్ 195 పరుగులు చేశాడు. ఒక్క సీజన్‌లే ప్రదర్శన బాలేదని కెప్టెన్సీ తీసేయడం.. టీమ్ నుంచి తప్పించడంపై అభిమానుల నుంచి వ్యతిరేకత మొదలైంది. సోషల్ మీడియా వేదికగా యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నారు. వచ్చే సీజన్‌కి వార్నర్ వేలంలోకి వస్తాడని భావిస్తున్నారు. అదే నిజమైతే డేవిడ్ వార్నర్‌ను దక్కించుకునేందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆసక్తిగా ఉందని సమాచారం.
డేవిడ్ వార్నర్ విషయంలో హైదరాబాద్ టీమ్ యాజమాన్యం సరైన నిర్ణయమే తీసుకుంటోందా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి.
ఇవీ చదవండి: సన్ రైజర్స్ కు డేవిడ్ వార్నర్ గుడ్ బై! బెంగళూరు జట్టులోకి?
ఫ్యాన్స్ ఖుష్.. ఎవరన్నారండి గొడవలున్నాయని.. రోహిత్, కోహ్లీ పిక్స్ వైరల్!