అధిక రక్తపోటు సమస్య ఉందా? ఈ 5 సూత్రాలు పాటించండి!

BP Checking

హైబీపీ అనేది ఎంతో పెద్ద సమస్య. అధిక రక్తపోటుతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది బాధపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న వయసు వారు కూడా దీని భారిన పడుతున్నారు. అందుకు కారణం కుటుంబ సమస్యలు, చదువులు, ఉద్యోగం, వ్యాపారం, జీవనం ఇలా కారణం ఏదైనా హై బీపీతో మరిన్ని సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. దీనిని అధిగమించడానికి ఎంతో కష్టపడుతున్నారు. అయితే ఎంతో సింపుల్‌ చిట్కాలతో అధిక రక్తపోటును కంట్రోల్‌ చేసుకోవచ్చు. ఆరోగ్యంగా జీవించవచ్చు.

ఉప్పు వాడకం తగ్గించాలి

BP Checking

బీపీకి ప్రధాన శత్రువు ఉప్పు.. అని అందరికీ తెలుసు. ముఖ్యంగా హై బీపీ ఉన్న వారు ఉప్పును ఎంతగానో తగ్గించాలి. వైద్యుల సూచన ప్రకారం.. సాధారణ మనుషులు కూడా ఏ విధంగానైనా రోజులో 2 గ్రాముల ఉప్పుకు మించి తినకూడదు అంటారు. హై బీపీ ఉన్న వారు పెరుగు/మజ్జిగ అన్నం తింటే దానిలో ఉప్పుకు బదులు కూర నంజుకుని తినడం మంచిదంటున్నారు. ఉప్పుకు ఎంత దూరంగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉండగలరు.

ఒత్తిడికి లోనుకావద్దు

ఒత్తిడి మనిషికి అతిపెద్ద శత్రువు. ఎక్కువ ఆలోచిస్తే.. ఎక్కువ ఒత్తిడికి లోనవుతారు. ఎక్కువ ఒత్తిడి అధిక రక్తపోటుకు దారితీస్తుంది. బీపీ పెరగడం వల్ల.. తల తిరగడం, వాంతులు, మైకం కమ్మడం వంటివి జరుగుతాయి. ఎంత పెద్ద సమస్య ఉన్నా కూడా.. మొదట ఒత్తిడికి లోనవకుండా ఉండాలి. టెన్షన్‌ పడటం వల్ల సమస్య తీరదు అనే చిన్న మాటను గుర్తుంచుకోవాలి. ఎంత ప్రశాంతంగా ఉంటే రక్తపోటు అంత కంట్రోల్‌ లో ఉంటుంది.

పొటాషియం తీసుకోండి

పొటాషియం కలిగిన ఆహారాన్ని ఎక్కువ తీసుకోవాలి. అవి శరీరంలో సోడియం స్థాయిని తగ్గిస్తాయి. ప్యాకేజ్డ్‌, ప్రాసెస్‌ చేసిన ఆహారాల్లో సోడియం ఎక్కువ ఉంటుంది. దానిని సమతుల్యం చేసుకునేందుకు పొటాషియం ఉండే ఆహారాన్ని తీసుకోవడం మంచిది. ఉదా: ఆకు కూరలు, టమాటాలు, ఆలూ, అరటి, ఆవకాడో, నట్స్‌, ఆరెంజ్‌, పాలు, పెరుగు వంటివి తీసుకోవాలి.

పొగతాగడం మానుకోవాలి

BP Checking

రక్తపోటుతో బాధపడేవారికి వైద్యులు చెప్పే వాటిలో ముఖ్యమైనది.. పొగ తాగడం మానుకోవాలి. స్మోకింగ్‌ రక్తపోటును పెంచుతుంది. ధూమపానం, మద్యపానం వల్ల రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. వాటిలో అధిక రక్తపోటు కూడా ఒకటి. ఈ అలవాట్లు రక్త నాళాలు కుచించుకు పోయేలా చేస్తాయి. తద్వారా రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడటం.. అధిక రక్తపోటుకు దారి తీయడం జరుగుతుంది.

వ్యాయామం/ధ్యానం

హై బీపీని అదుపు చేసేందుకు తప్పకుండా వ్యాయామం చేయాలి. ఎక్సర్‌ సైజ్‌ చేయడం వల్ల మనసు, మెదడు ప్రశాంతంగా, ఆ రోజంతా హుషారుగా ఉంటుంది. ఆరోగ్యంగా జీవించేందుకు వ్యాయామం తప్పనిసరి. వయసును బట్టి, మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి వ్యాయామం చేయాలి. మరే ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నా.. నిపుణుల సూచన తీసుకోవాలి. ధ్యానం కూడా ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ధ్యానం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడి తొలగిపోతుంది. రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది.

ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ అధిక రక్తపోటును మీరు అదుపు చేయవచ్చు. ఆరోగ్యంగా ఉండవచ్చు.