సిరి- షణ్ముఖ్‌ విషయంలో కింగ్‌ నాగార్జున సీరియస్‌..

siri shannu nagarjuna

బిగ్‌ బాస్‌ 5 తెలుగు’ హౌస్‌ లో ఆటకన్నా ఇప్పుడు గొడవలు, గ్రూపులే ఎక్కువగా ఉన్నాయి. ఈ వారం మొత్తం చూస్తే బాగా హైలెట్‌ అయిన విషయం సిరి- షణ్ముఖ్‌ మధ్య ఏం జరుగుతోంది. ఎందుకు వాళ్లు అలా చేస్తున్నారు. ఎందుకు సిరి తనని తాను అలా హర్ట్‌ చేసుకుంటోంది? నిజంగానే సిరి- షణ్ముఖ్‌ కు లిప్‌ లాక్‌ ఇచ్చిందా? ఇవే ప్రశ్నలు తెగ వైరల్ అవుతున్నాయి సోషల్‌ మీడియాలో. లిప్‌ లాక్‌ విషయం పక్కన పెడితే షణ్ముఖ్‌ తో సిరి బాగా కనెక్ట్‌ అవుతున్నట్లు కనిపిస్తోంది. ఇన్ని రోజులు ఇద్దరూ ఒకే దగ్గర ఉండటం, మొదటి నుంచి వాళిద్దరూ కలిసే ఉండటం ఆమెపై మెంటల్‌గా ప్రెజర్‌ పడుతున్నట్లు తెలుస్తోంది. మొదటి నుంచి వారి మధ్య ఏదో నడుస్తోంది అని ప్రాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఆ విషయాలపై తాజాగా నాగార్జున కూడా ప్రశ్నించాడు.

బిగ్‌ బాస్‌ లో నీ ప్రవర్తన చూసి ఇంకా నలుగురు నీకులా అవ్వాలి అనుకోవాలి. కానీ, అలా మాత్రం ఉడంకూడదు అని అనుకోకూడదు’ అంటూ కింగ్‌ నాగార్జున చాలా సీరియస్‌ అయ్యాడు. మరోవైపు షణ్ముఖ్‌పై కూడా నాగార్జున సీరియస్‌ అయ్యాడు. దీప్తీని మరీ అంతలా మిస్‌ అయితే వెళ్లిపోవచ్చు అంటూ గేట్స్‌ ఓపెన్‌ చేయించాడు. తాజాగా సిరి చేసిన కామెంట్లు ప్రేక్షకుల్లో కొత్త అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. ఇప్పిటకే జరుగుతున్న ప్రచారాలకు ఊతమిచ్చేలా సిరి కామెంట్స్‌ ఉన్నాయి. ‘ఏమో సార్‌ నాకు కూడా క్లారిటీ లేదు. నా స్టోరీ నాకు తెలుసు. బయట నేనేంటి తెలుసు. స్టిల్‌ నాకు ఎందుకు కనెక్షన్‌ వస్తోంది తెలియట్లేదు’ అంటూ ఇన్‌ డైరెక్ట్‌ గా షణ్ముఖ్‌ కు కనెక్ట్‌ అవుతున్నాను అని చెప్పే విధంగా ఉన్నా ఆ కామెంట్స్‌. మరి అది ఎంత వరకు నిజం లేదంటే అది ప్రోమో స్ట్రాటజీనా అనేది ఎపిసోడ్‌ లో చూడాలి. సిరి- షణ్ముఖ్‌ రిలేషన్‌ పై మీ అభిప్రాయాలను కామెంట్‌ చేయండి.