‘బిగ్ బాస్ 5 తెలుగు’ హౌస్ లో ఎమోషనల్ డ్రామా కొనసాగుతూనే ఉంది. అయితే సిరి- ఆమె తల్లి గురించి మాత్రం వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. మొదట సిరి- షణ్ముఖ్ హగ్గుల గురించి బాగా కోప్పడిన ఆమె ఆ తర్వాత జీవితంలో తాను ఎదుర్కొన్న కష్టాల గురించి చెప్పుకొని బాధపడింది. పాన్ షాప్ పెట్టుకుని తన పిల్లలను ఎలా పెంచుకొచ్చింది చెప్పుకొచ్చింది. సిరిని ఎంత కష్టపడి చదివించింది తెలియజేసింది.
ఇదీ చదవండి: సిరి తల్లి కామెంట్స్ పై స్పందించిన సిరి లవర్ శ్రీహాన్..
‘సిరికి తెలియక ముందే వాళ్ల చనిపోయాడు. చిన్న పాన్ పాప్ పెట్టుకుని పిల్లలని చదివించాను. ఎన్నో మాటలు పడ్డాను. అన్నయ్య వాళ్ల హెల్ప్ తీసుకుని వీళ్లని పెంచాను. బాగా చదువుకున్నారు. నా కూతురైతే కోట్ల మంది మెచ్చుకునేలా ఆడుతోంది’ అంటూ సిరి తల్లి భావోద్వేగానికి లోనయ్యారు. సిరి కూడా ఆమె తల్లిని పట్టుకుని గట్టిగా ఏడ్చేసింది. చివరిగా వెళ్లిపోతూ కప్పుతో తిరిగిరావాలంటూ ఆమె కూతుర్ని దీవించి వెళ్లింది. పనిలో పని ఇంట్లోని సభ్యులు అందరూ ఆశీర్వాదం తీసుకుని కప్పు కొట్టాలని నిర్ణయించుకున్నారు. సిరి తల్లి పడిన కష్టాలపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.