సిరి తల్లి కామెంట్స్‌ పై స్పందించిన సిరి లవర్‌ శ్రీహాన్‌..

shrihan siri

బిగ్‌ బాస్‌ 5 తెలుగు’ హౌస్‌ లో ఇంకా ఫ్యామిలీ ఎమోషన్స్‌ నడుస్తూనే ఉన్నాయి. తాజాగా సిరి- షణ్ముఖ్‌ హగ్గుల విషయంలో సిరి తల్లి చేసిన కామెంట్స్‌ ఇంకా వైరల్‌ అవుతూనే ఉన్నాయి. హగ్‌ చేసుకోవడం నచ్చడం లేదని ఆమె అనడం.. అందుకు సిరి సీరియస్‌ అవ్వడం. ఆమె మాటలకు షణ్ముఖ్‌ హర్ట్‌ అవ్వడం.. సిరిని దూరం పెట్టడం చూశాం. తాజాగా ఆ అంశంపై సిరి లవర్‌ శ్రీహాన్‌ కూడా స్పందించాడు. గతంలోనూ సిరి- షణ్ముఖ్‌ రిలేషన్‌ పై కామెంట్స్‌ వచ్చినప్పుడు కూడా శ్రీహాన్‌ సపోర్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజా పరిస్థితిపై కూడా శ్రీహాన్‌ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

 

View this post on Instagram

 

A post shared by Shrihan (@imshrihan)

shrihan siriతప్పుగా అనుకోకండి..

సిరి తల్లి మాట్లాడిన మాటలను శ్రీహాన్‌ తప్పుబట్టలేదు. ఒక తల్లిగా ఆమె భావాలను వ్యక్తపరిచింది. కానీ, అవి తప్పుగా అర్థమయ్యాయని శ్రీహాన్‌ అన్నాడు. ‘ఆమెకు ఎలా చెప్పాలో తెలీదు. పాపం వాళ్లు ఉన్న అట్మాస్ఫియర్‌ అలాంటింది. ఒక తల్లిగా తన కూతుర్ని బయటన బ్యాడ్‌ గా మాట్లాడుతుంటే తీసుకోలేక అలా అనేశారు. చివరికి నేను కూడా అలా అంటారని ఊహించలేదు. ఒ కారణంతో ఆమెను ద్వేషించకండి. ఆమె తరఫున నేను క్షమాపణలు చెప్తున్నా. వాళ్ల రిలేషన్‌ అంటే నాకు గౌరవం ఉంది. లెట్స్‌ సపోర్ట్‌ సిరి’ అని శ్రీహాన్‌ ఇన్‌ స్టా స్టోరీ పోస్ట్‌ చేశాడు. మరోసారి వారి మధ్య ఉన్న బంధం ఎంత గట్టిదో నిరూపించాడు శ్రీహాన్‌. సిరి లవర్‌ శ్రీహాన్‌ స్పందనపై మీ అభిప్రాయాలను కామెంట్‌ చేయండి.

 

View this post on Instagram

 

A post shared by Shrihan (@imshrihan)