బిగ్ బాస్ లో షాకింగ్ ట్విస్ట్! హౌస్ నుండి బయటకి షణ్ముఖ్ జస్వంత్!

Shanmuk Bigboss5 Siri

బిగ్ బాస్..తెలుగునాట ఈ రియాలిటీ గేమ్ షోకి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఈ క్రేజ్ కి తగ్గట్టే ఈ సీజన్ కూడా మంచి రేటింగ్స్ తో దూసుకుపోతుంది. ఇప్పటికే ఎలిమినేట్ అయిన వారి సంగతి పక్కన పెడితే, హౌస్ లో ఉన్న వారు అంతా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అని చెప్పుకోవాలి. వీరిలో షణ్ముఖ్ జస్వంత్ ఫ్యాన్ బేస్ వేరు.నిజానికి షణ్ముఖ్ జస్వంత్ టాస్క్ ల విషయంలో చాలా పూర్. కానీ.., అతనికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంతకాలం అతన్ని కాపాడుతూ వస్తోంది. నిజానికి ఇంత సపోర్ట్ ఉన్నా, షణ్ముఖ్ జస్వంత్ మాత్రం దీప్తి సునైనా కోసం ఢీలా పడిపోతున్నాడు.

హౌస్ లో షణ్ముఖ్, సిరి జోడీ బాగా పాపులర్ అయ్యింది. సిరితో గొడవ పడనంత సేపు షణ్ముఖ్ బాగానే ఉంటున్నాడు. కానీ.., సిరి హార్ట్ చేయగానే తాను దీప్తి సునైనాని మిస్ అవుతున్నాను అంటూ తెగ బాధ పడిపోతున్నాడు. ఈ మధ్య కాలంలో షణ్ముఖ్-సిరి మధ్య గొడవలు బాగానే పెరిగిపోయాయి. దీంతో.. షణ్ముఖ్ దీప్తిని ఎక్కువగా కలవరిస్తున్నాడు. ఈ క్రమంలోనే షణ్ముఖ్ గేమ్ పై ఫోకస్ తప్పుతున్నాడు కూడా. తాజాగా ఇదే విషయంపై హోస్ట్ నాగార్జున సీరియస్ అయ్యారు.

తాజాగా విడుదలైన బిగ్ బాస్ ప్రోమో చూస్తే ఈ విషయం అర్ధం అవుతుంది. షణ్ముఖ్ ని రూమ్ లోకి పిలిచిన నాగ్.. ఏమైంది షణ్ముఖ్ నీకు? దీప్తిని అంతలా మియోస్ అవుతున్నావా అని అడగగా, దానికి షన్ను అవునని సమాధానం ఇచ్చాడు. దీంతో నాగార్జున సీరియస్ అయ్యారు. బిగ్ బాస్ గేట్స్ ఓపెన్ చేపించి, షణ్ముఖ్ ని ఇప్పుడే హౌస్ నుండి బయటకి పోవాల్సిందిగా కోరాడు. అయితే.., ఈ విషయంలో షణ్ముఖ్ తరువాతి రియాక్షన్ ఏమిటి అనేది ప్రోమో లో చూపించలేదు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.