బిగ్ బాస్ హిస్టరీలో షణ్ముఖ్ ఫ్యాన్స్ సంచలనం!

shannu trending tweet

బిగ్‌ బాస్‌ 5 తెలుగు’ మోస్ట్‌ సక్సెస్‌ఫుల్లీ రన్నింగ్‌ టీవీ రియాలిటీ షోగా ఉంది. అన్ని సీజన్లతో పోలిస్తే సీజన్‌- 5 మాత్రం రచ్చ రచ్చగా ఉంది. గత సీజన్ల కంటెస్టంట్లు సైతం నోరెళ్లబెడుతున్నారు. ఇంట్లో సభ్యులు తగ్గుతున్న కొద్దీ గొడవలు పెరుగుతున్నాయి. గ్రూపులు, ఫ్రెండ్స్‌ అంటూ ఒకరితో ఒకరు గొడవలకు దిగుతున్నారు. అలా మొదలైన ఒక గొడవ బయట ఫ్యాన్స్‌ మధ్య ట్విట్టర్‌ వార్‌గా మారింది. మరే బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్‌ కు దక్కని రికార్డు షణ్ముఖ్‌ కు దక్కింది. సన్నీ- షణ్ముఖ్‌ల మధ్య జరిగిన ఆ గొడవ ట్వట్టర్‌లో మాటల యుద్ధంగా ఆ తర్వాత హ్యాష్‌ ట్యాగ్‌ వార్‌గా మారింది. అందులో భాగంగా షణ్ముఖ్‌ ఫ్యాన్స్‌ ఒక సంచలనమే సృష్టించారు.

shannu trending tweet24 గంటల్లో ట్విట్టర్‌ 15 లక్షల ట్వీట్లు..

సాఫ్ట్‌వేర్‌ డెవలప్పర్స్‌, సూర్య వంటి వెబ్‌ సిరీస్‌లతో యూత్‌లో షణ్ముఖ్‌ ఫ్యాన్స్‌ మరింత పెరిగారు. యూట్యూబ్‌లో 4.2 మిలియన్‌ ఫాలోవర్లు, ఇన్‌స్టాలో 2.2 మిలియన్‌ ఫాలోవర్లు ఉన్న షణ్ముఖ్‌కు ఈ రికార్డు పెద్ద విషయం కాదులెండి అంటున్నారు కొందరు. #MrCoolShanmukh అనే హ్యాష్‌ ట్యాగ్‌తో ట్విట్టర్‌లో ట్రెండ్‌ క్రియేట్‌ చేశారు. కేవలం 24 గంటల్లో దాదాపు 15 లక్షల ట్వీట్లు చేసినట్లు ప్రచారాలు కూడా చేస్తున్నారు. సన్నీతో జరిగిన గొడవే ఇందుకు ప్రధాన కారణం. మరోవైపు వీజే సన్నీ, మానస్‌ అభిమానులు సైతం ఈ హ్యాష్‌ ట్యాగ్‌ వార్‌కు దిగారు కానీ చెప్పుకోదగిన ఫలితం రాలేదు. నవంబరు 13న సాయంత్రం 4 గంటల నుంచి నవబంరు 14 సాయంత్రం 4 గంటల వరకు ఈ హ్యాష్‌ ట్యాగ్‌ 15 లక్షల సార్లు మెన్షన్‌ అయినట్లు లెక్కలు చూపిస్తున్నారు.

అసలు గొడవ..

ఎప్పటి లాగానే ఒక టాస్కు పెట్టి వారిలో కొందరిని కెప్టెన్సీ పోటీదారులుగా ఎంపిక చేస్తారు. అలా ఎంపికైన వారికి మళ్లీ ఒక టాస్కు పెట్టి కెప్టెన్‌ను ఎంచుకుంటారు. అలా కెప్టెన్సీ పోటీదారులుగా ఎంపికైన సిరి, కాజల్‌, రవి, సన్నీలకు ఒక టాస్కు పెట్టారు. అందులో సిరి.. సన్నీని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. అతడ్ని గట్టిగా పట్టుకుని నిలువరించే ప్రయత్నం చేస్తుంది. అలా చేసినందుకు సన్నీ బాగా ఫైర్‌ అయ్యాడు. పోటీపడే వాడిని అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించాడు. ‘నేను కొడితే అప్పడం అవుతావు’ అని సన్నీ అన్న మాటతో అసలు గొడవ మొదలైంది. అందుకు షణ్ముఖ్‌ రెస్పాండ్‌ అవ్వగానే సన్నీ ఇంకా ఫైర్‌ అయ్యాడు. అక్కడే నాలుగు మాటలు జారాడు కూడా.