‘బిగ్‌ బాస్‌ 5 తెలుగు’ 12వ వారం కెప్టెన్‌ గా షణ్ముఖ్‌..

బిగ్‌ బాస్‌ 5 తెలుగు’ హౌస్‌ లో నామినేషన్స్‌ వేడి ఇంకా తగ్గలేదు. నామినేషన్స్‌ తర్వాత కాజల్‌- శ్రీరామచంద్ర బాగా ఆర్గ్యూ చేసుకుంటున్నారు. ఏ చిన్న సందర్భం దొరికినా కూడా అస్సలు ఇద్దరి మధ్యలో పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటోంది. ఇక ఈవారం కూడా బిగ్‌ బాస్‌ ఇంట్లోని సభ్యుల కోసం కెప్టెన్సీ టాస్కు ఇచ్చాడు. ‘అది నియంత మాటే శాసనం’ ఈ టాస్కులోనూ శ్రీరామ చంద్ర- కాజల్‌ గొడవ ఆగలేదు. కొట్టుకుంటూనే ఉన్నారు. ప్రతిసారి బజర్‌ మోగినప్పుడు ఒకళ్లు ఆ సింహాసనం మీద కూర్చోవాలి అప్పుడు వాళ్లు చెబితే అదే జరగాలి. అలా సాగిన టాస్కులో చివరికి ఒకళ్లు కెప్టెన్‌ అవుతారు.

12వ కెప్టెన్‌ గా షణ్ముఖ్‌..

బిగ్‌ బాస్‌ హౌస్‌ లో ఈ సీజన్‌ లో రెండుసార్లు కెప్టెన్‌ అయ్యే అవకాశం దక్కింది విశ్వ ఒక్కడికే. ఆ తర్వాత ఆ రికార్డును షణ్ముఖ్‌ భర్తీ చేశాడు. బిగ్‌ బాస్‌ 5 తెలుగు సీజన్‌ లో రెండోసారి కెప్టెన్‌ గా షణ్ముఖ్‌ అవతరించాడు. మొదటి సారి కెప్టెన్ అయినప్పుడు షణ్ముఖ్‌ తన మార్క్‌ చూపించాడు. సంచాలక్‌ గా కూడా బాగా పర్ఫామ్‌ చేశాడు. మరి రెండోసారి కెప్టెన్సీ ఎలా నిర్వహిస్తాడో చూడాలి. తన నిర్ణయాన్ని నిక్కచ్చిగా చెప్పెవాడు. ఎవరు చెప్పినా సంచాలక్‌ గా తన నిర్ణయాన్ని మార్చుకునేవాడు కాదు. రెండోసారి కూడా అదే మార్క్‌ చూపించగలిగితే షణ్ముఖ్‌ పై వస్తున్న ఎన్నో కామెంట్స్‌ కు సమాధానం చెప్పినవాడు అవుతాడు. షణ్ముఖ్‌ రెండోసారి కెప్టెన్‌ అవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్‌ చేయండి.